Aamir Khan: అమీర్ ఖాన్ విడాకుల‌కి కార‌ణం దంగ‌ల్ బ్యూటీనా..!

Aamir Khan: బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ శ‌నివారం రోజు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న భార్య కిర‌ణ్ రావు నుండి విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. దీంతో వారి 15 ఏళ్ల వైవాహిక బంధానికి తెర ప‌డింది. 56 ఏళ్ల వ‌య‌స్సులో అమీర్ ఖాన్ విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ న‌డిచింది. అదే క్ర‌మంలో దంగ‌ల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌ పేరు తెర మీదకు వచ్చింది. రికార్డుస్థాయిలో ఆమె పేరు హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు ట్విటర్‌లో పోస్ట్ అయ్యాయి.

aamir Khan

త‌న సినిమాలతో యువతలో స్ఫూర్తి నింపిన అమీర్ ఖాన్ ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు చాలా మంది అభిమానులు. అయిఇతే ఫాతిమా సనా షేక్ తో రిలేష‌న్ షిప్ కొన‌సాగించేందుకు ఇలా చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఫాతిమా గురించి ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. హిందీ సినిమా- టెలివిజన్ రంగాలకు సుపరిచితురాలు అయిన ఫాతిమా చాయ్ 420,వన్ 2 కా 4 వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సనా షేక్ కెరీర్ ప్రారంభించారు.

అమీర్ ఖాన్ సరసన `దంగల్` చిత్రంలోనూ నటించింది. అప్పటి నుంచి సనా షేక్ తో అమీర్ ఖాన్ ఎఫైర్ వార్తలు అంతర్జాలాన్ని షేక్ చేస్తూనే ఉన్నాయి. 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్‌ మీడియా హౌజ్‌లలో పుకార్లు వినిపించాయి. ఈ విష‌యాన్ని ఫాతిమా ప‌లు సార్లు ఖండించింది. ఇలా అమీర్ ఖాన్ విడాకుల విష‌యాన్ని ఫాతిమాకు లింక్ పెట్డం భావ స్వేచ్ఛ ప్ర‌క‌ట‌న‌లో భాగం అని నెటిజ‌న్స్ అంటున్నారు.

Aamir Khan

కారణం ఏదైనా కానీ ఖాన్ తన భార్యకు విడాకులిస్తున్నానని ప్రకటించగానే ఫాతిమను ట్విట్టర్లో ట్రోల్ చేశారు. # ఫాతిమా సనా షేక్ ట్రెండింగ్ అయ్యారు. అయితే అమీర్ తో ఫాతిమ ఎఫైర్ గురించి పబ్లిగ్గా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఏవో కేవలం వేదికలపైనా మీడియా సమావేశాల్లో ఆ ఇద్దరి మధ్య కొంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు మినహా ఆ ఇద్దరి సన్నిహిత అనుబంధంపై ఆధారాలు అయితే లేవు. కానీ ఎఫైర్ వార్తలతో అంతర్జాలం అట్టుడికింది.

ఈ రూమ‌ర్స్‌కి ముఖ్య కార‌ణం ఫాతిమా ముంబైకి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లేది. అంబానీ ఇంట జరిగిన పార్టీకి, అవార్డుల వేడుకల దగ్గర కూడా వీళ్లు జోడిగా కనిపించడం..కిర‌ణ్ రావ్ సైడ్ అయిపోవ‌డం అంద‌రిలో కొత్త అనుమానాలు క‌లిగిస్తున్నాయి. ఫాతిమా ప్రస్తుతం మరోసారి అమీర్ ఖాన్ తో నటించనుంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్- అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.