RC15 Movie : శంక‌ర్ గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా.. 80 మంది ఫారెన్ డ్యాన్స‌ర్స్‌తో చిందులు

RC15 Movie : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ఆర్సీ 15.ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు. సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15వ తేదీన మొదలుపెట్టింది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్‌ లో చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్లోని కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను చిత్రీకర్తిస్తున్నారని టాక్ అయితే నడుస్తోంది.

RC15 movie song shooting update
RC15 movie song shooting update

ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని ఈ సెట్ కోసం 40 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.ఈ నెల 15వ తేదీ నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో చరణ్ – కియారా కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తో పాటు ఒక పాటను కూడా ప్లాన్ చేశారు. చరణ్ – కియారాతో పాటు అమెరికా .. రష్యా .. ఉక్రెయిన్ .. బ్రెజిల్ .. ఆఫ్రికా .. యూరప్ తదితర దేశాలకు చెందిన 80 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొననున్నారు.

10 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించనున్నారట. తమన్ స్వరపరిచిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని ఈ సెట్ కోసం 40 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. పది రోజుల పాటు ఆ అదిరిపోయే లొకేషన్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో డ్యాన్సర్లు ఇప్పటికే బస చేసారు.

మరే ఇండియన్ సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఫారిన్ డ్యాన్సర్ లను వాడలేదని అంటున్నారు. ఖచ్చితంగా తెరపై ఓ కొత్త లోకం ఆవిష్కారమవుతుందని చెప్తున్నారు. సినిమా హైలెట్స్ లో ఇదొకటి అని వినిపిస్తోంది. గతంలో ‘జీన్స్’ సినిమాలోని ఒక పాట కోసం ఆయన ప్రపంచ వింతలను కవర్ చేశాడు. సినిమాలో ఆ పాట హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు అలాంటిదే జరగబోతోంది.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు 350 కోట్ల భారీ డీల్ చేసాడు. దిల్ రాజు జీ స్టూడియోస్‌ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, ఆ డీల్ ప్రకారం RC15 యొక్క థియేట్రికల్, శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను జీ స్టూడియోస్‌ కు అమ్మేసినట్టే.