RC15 Movie: ఆర్‌సీ15పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్.. క‌ళ్లు చెదిరే రేటుకు అమ్ముడు పోయిన రైట్స్

RC15 Movie: ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా రేంజ్‏లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాప్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

RC15 Movie Rights Sold for Huge Prices
RC15 Movie Rights Sold for Huge Prices

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేశారు మేకర్స్. పూనే, స‌తారా, పాల్‌ట‌న్ ప్రాంతాల్లో స్పెష‌ల్ సీక్వెన్స్‌ల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శంకర్ తో సినిమా అంటే చాలా వరకు నిర్మాతల్లో లెక్కలు ఊహకందని రేంజ్ లో ఉంటాయి. అయితే దిల్ రాజు కూడా ముందుగానే ఆలోచించి శంకర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఆయన శంకర్ లెక్కలను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరో నిర్మాణ సంస్థకు అమ్మేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాణ సంస్థ మరేదో కాదు జీ స్టూడియోస్ అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. జి స్టూడియోస్ రామ్ చరణ్ 15వ సినిమా రిలీజ్ హక్కులతో పాటు డిజిటల్ శాటిలైట్ హక్కులను కూడా రౌండ్ ఫిగర్ నెంబర్ తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా మొత్తం దాదాపు 350 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే పట్టు దొరకకపోవడంతో జీ స్టూడియోస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి RC 15 పాన్ ఇండియన్ మార్కెట్ కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.

RC15 Movie Rights Sold for Huge Prices
RC15 Movie Rights Sold for Huge Prices

ఈ మూవీ సెకండ్ షెడ్యూల్‏ను హైదరాబాద్‏లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనెల 15న ప్రారంభించారు. ఇక్కడ చరణ్, కియారా అద్వాని కాంబోలో కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ఇందుకోసం ఇక్కడ భారీ సెట్ వేయిస్తున్నారట. అంటే ఆ సెట్ కోసం దాదాపు రూ. 40 కోట్లను కేటాయించినట్లుగా టాక్. ఈ సినిమాలో జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.