Raviteja: ఈ ఫోటో చూస్తుంటే రవితేజ కొడుకు కూడా హీరో మెటీరీయల్ కి అచ్చుగుద్దినట్టు సరిపోయాడు

Raviteja: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి త‌ర్వాత అంత‌టి స్వ‌యం కృషితో ఎదిగారు ర‌వితేజ. సినిమాల‌పై ఆస‌క్తితో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. నిన్నేపెళ్లాడతా వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే 1997 లో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సింధూరం మూవీలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా నటించాడు.

Raviteja

నీ కోసం సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ర‌వితేజ ఇక అక్క‌డ నుండి వెను దిరిగి చూసుకోలేదు. పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు , వరస విజయాలతో మాస్ మహారాజ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఈ ఏడాది క్రాక్ సినిమాతో మంచి విజ‌యం సాధించిన ర‌వితేజ అదే స్పీడ్‌తో ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల ఇటలీలో జ‌రిగింది. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా, మ‌రి కొద్ది రోజుల‌లో మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ర‌వితేజ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న ఫ్యామిలీతో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తాడు. కాని ఎక్క‌డా కూడా వారి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు బ‌య‌ట‌కు రానివ్వ‌డు.

2000లో రవితేజ, కళ్యాణి ని పెళ్ళిచేకున్నారు.అప్పటికి రవితేజ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు. ఆయనకు బ్రేక్ ఇచ్చిన మొదటి చిత్రం ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు 2002లో విడుదలైంది. అదే ఏడాది ఆయన నుండి ఇడియట్, ఖడ్గం వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. రవితేజ-కళ్యాణిలకు మొదటి సంతానంగా 2003లో అమ్మాయి మోక్షద పుట్టింది. ఇక కొడుకు మహాధాన్ 2010లో జన్మించాడు.

ఇప్పుడు సెల‌బ్స్ అంద‌రు దాదాపు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. కాని ర‌వితేజ ఎప్పుడో ఒక సారి త‌న ఫ్యామిలీని సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం చేస్తుంటాడు. ఈ రోజు ఫాద‌ర్స్‌డేని పురస్క‌రించుకొని త‌న తండ్రి , కొడుకుతో దిగిన ఫొటోని షేర్ చేశాడు. ఈ ఫొటోలో మ‌హాధాన్ చాలా స్మార్ట్‌గా,క్యూట్‌గా క‌నిపిస్తున్నాడు. మ‌హాధాన్ హీరో మెటీరీయల్ కి అచ్చుగుద్దినట్టు సరిపోయాడుగా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌హాధాన్‌ని చూస్తుంటే రాబోయే రోజుల‌లో కాబోయే హీరో అనే అనుమానం త‌ప్ప‌క క‌లుగుతుంది. ర‌వితేజ ఫ్యామిలీలో ఆయ‌న త‌మ్ముళ్లు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా రాణించ‌లేకపోయారు. కుమారుడిని రానున్న రోజుల‌లో హీరోగా ప‌రిచ‌యం చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.