RAVI TEJA: స్పీడ్ పెంచిన ర‌వితేజ‌.. స‌ర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

RAVI TEJA మాస్ మ‌హారాజా ర‌వితేజ మంచి జోరు మీదున్నాడు. కొన్నాళ్లుగా స‌రైన హిట్స్ లేక దిగాలుగా ఉన్న ర‌వితేజ ఈ ఏడాది క్రాక్ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫ్యాన్స్‌కు మంచి జోష్ అందించింది. లాక్ డౌన్ త‌ర్వాత విడుద‌లైన ఈ చిత్రం మిగ‌తా చిత్ర నిర్మాత‌ల‌కు స్థైర్యాన్ని క‌లిగించింది. క్రాక్ విజ‌యంతో మంచి మూడ్‌లో ఉన్న మాస్ రాజా ప్ర‌స్తుతం ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల ఇటలీ జ‌రిగింది. అన‌సూయ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంది.

మే 28న ఖిలాడి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ ఫ్యాన్స్‌కు అమితమైన ఆనందాన్ని క‌లిగించాయి. ఇప్పుడు వారి సంతోషాన్ని రెట్టింపు చేయాల‌ని భావిస్తున్న ర‌వితేజ టీజ‌ర్‌కు టైం ఫిక్స్ చేశాడు. త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట‌ర్ విడుదల చేస్తూ ఏప్రిల్ 12న ఉదయం 10:08 నిమిషాలకు ఖిలాడి మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అభిమానుల‌కు బిగ్ ట్రీట్ అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

రాక్ష‌సుడు చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ర‌మేష్ వ‌ర్మ ఇప్పుడు ఖిలాడి చిత్రాన్ని అద్భుతంగా చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఖిలాడి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. త‌మిళ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. అన‌సూయ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఆమె పాత్ర‌పై భిన్న‌మైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అర్జున్, మ‌ల‌యాళ హీరో ముకుంద‌న్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement