Raviteja : రవితేజ ‘ఖిలాడి’ డైరెక్ట్ ఓటీటీలో..?

Raviteja : రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఖిలాడి డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మూడేళ్ళ తర్వాత రవితేజ క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఈ ఊపుతో జోరు పెంచాడు.ఆ జోరులోనే ప్రస్తుతం ‘ఖిలాడి’ టైటిల్ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ లో రెండు రకాల పాత్రల్లో నటిస్తున్నాడు. వరుసగా నాలుగు ప్లాప్ సినిమాల అనంతరం క్రాక్ సూపర్ హిట్ ఖాతాలో పడేసరికి మాస్ రాజా చాలా కాన్ఫిడెంట్ గా సినిమాలు లైన్ లో పెట్టేసాడు. కరోనాకు భయపడి హీరోలు – నిర్మాతలు పూర్తయినా కూడా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ధైర్యం చేయలేదు.

raviteja-khiladi in OTT
raviteja-khiladi in OTT

కానీ రవితేజ సినిమా మీద నమ్మకంతో క్రాక్ మేకర్స్ రిలీజ్ చేశారు. యాభైశాతం ఆక్క్యూపెన్సితో సినిమా రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. క్రాక్ హిట్ కొట్టి ఇండస్ట్రీకి ధైర్యం ఇవ్వడంతో వరసగా మార్చ్ వరకు సినిమాలు రిలీజ్ చేశారు. మళ్ళీ సెకండ్ వేవ్ దెబ్బతో ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన సినిమాల నుంచి వరసగా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 28న రిలీజ్ కావాల్సిన రవితేజ ఖిలాడి కూడా పోస్ట్ పోన్ అయింది. ఇదే రోజు రావాల్సిన బాలయ్య అఖండ కూడా అదే పరిస్థితి.

Raviteja : రవితేజ ఖిలాడికి అమెజాన్ నుంచి దాదాపు 45 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్..

అయితే ఈ మధ్య ఖిలాడి ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ నుంచి దాదాపు 45 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. కానీ ఇంకా మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి కన్‌ఫర్మేషన్ రాలేదు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఖిలాడి థియేటర్స్ రిలీజ్ తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.