Krack: క్రాక్ హీరో ర‌వితేజ కాదు, మ‌రెవ‌రో మీకు తెలుసా?

Krack: సినిమా ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు ల‌క్ కూడా అవ‌స‌రం. ఒక్కోసారి అదృష్టం లేక హిట్ అయ్యే సినిమాల‌ను వేరే కార‌ణాల వ‌ల‌న రిజెక్ట్ చేస్తుంటారు కొంద‌రు హీరోలు. ఇప్పుడు ఈ ఏడాది తొలి భాగంలో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన క్రాక్ చిత్రాన్ని రవితేజ కంటే ముందు మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కి వెళ్లింది. ఆ హీరో ఇత‌ర కార‌ణాల వ‌ల‌న రిజెక్ట్ చేయ‌డంతో ర‌వితేజ ఆ ఆఫ‌ర్ అందుకొని చాలా రోజుల త‌ర్వాత మంచి విజ‌యాన్ని అందించుకున్నారు. హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాకు గోపిచంద్ మ‌లినేని క్రాక్ రూపంలో అదిరిపోయే హిట్ ఇవ్వ‌డంతో ర‌వితేజ ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు.

ర‌వితేజ‌కు హీరోగా క్రాక్ బ్రేక్ ఇవ్వ‌గా, ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరో ర‌వితేజ కాద‌ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ప్రస్తావించారు. ఈ సినిమా కథను ముందుగా బాలకృష్ణతో తీయాలనుకున్నట్టు నిర్మాత కళ్యాణ్ చెప్పుకొచ్చారు. గోపిచంద్ మ‌లినేని తమిళంలో హిట్టైన ‘సేతుపతి’ సినిమాను కొంచెం మార్పులు చేసి నాకు వినిపించారు. ఇది మా స్టోరీనే క‌దా అని గోపిచంద్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించాం. బాల‌య్య ఆ స‌మ‌యంలో ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఆ క‌థ‌ను ర‌వితేజ‌తో తెర‌కెక్కించారు గోపిచంద్. అయితే ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న‌ గోపీచంద్ మలినేని ఇపుడు బాలకృష్ణతో ఓ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ రియలిస్టిక్ స్టోరీని తెరకెక్కించబోతున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటన చేసే అవకాశాలున్నట్టు సమాచారం.

ఇక ర‌వితేజ ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అర్జున్ ప్ర‌తి నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటించారు.అన‌సూయ కీల‌క పాత్ర పోషించింది. ఇటలీలో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌లైంది. కాగా, ర‌వితేజ చివ‌రి చిత్రం క్రాక్ మూవీని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూడో సినిమాకు ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూర్చ‌గా, జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్రసాద్‌, చిర‌గ్ జాని, మౌర్యని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి తదితరులు నటించారు.

యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అనసూయ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇటలీ కొంత భాగం షూటింగ్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ కొంచెం బాలెన్స్ ఉంది. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ సినిమా విడుదలై ఉండేది.