Raviteja : రవితేజ – గోపీచంద్ ఒకే కథ తో సినిమా చేస్తే ఎలా..?

Raviteja : రవితేజగోపీచంద్ ఒకే జోనర్ లో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. క్రాక్ సినిమాతో మాస్ మహారాజ రవితేజ మంచి కమర్షియల్ హిట్ అందుకొని ఫుల్ ఫాం లోకి వచ్చాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అన్న సినిమా చేస్తున్నాడు. డ్యూయల్ రోల్ లో రవితేజ నటిస్తున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా మే 28 న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో రవితేజ కెరీర్ లో 68 వ సినిమాని రీసెంట్ గా ప్రకటించారు.

raviteja-gopichand-are-they going-to-make-movie-with-same-story...?
raviteja-gopichand-are-they going-to-make-movie-with-same-story…?

నక్కిన త్రినాథ రావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. టీజీ విశ్వ ప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించనున్నారు. కాగా యాక్షన్ హీరో గోపీచంద్ తో మారుతి ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అన్న టైటిల్ ఫిక్స్ చేస్తూ రీసెంట్ గా పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ పోస్టర్ లోనే ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు మేకర్స్. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్2 బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

Raviteja : రవితేజ ని నక్కిన త్రినాథ రావు లాయర్ క్యారెక్టర్ లో చూపిస్తాడా..?

అయితే ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. రవితేజ నటించబోతున్న సినిమా.. అలాగే గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమా కథ ఒకే జోనర్ లో తెరకెక్కబోతుందని ఈ సినిమాలలో హీరోల క్యారెక్టర్స్ లాయర్ అని వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ హిందీలో వచ్చిన జాలీ ఎల్ఎల్‌బి2 ఆధారంగా తెరకెక్కుతుందని అంటున్నారు. ఇక రవితేజ కోసం నక్కిన త్రినాథ రావు తీయబోయో సినిమా లో లాయర్ క్యారెక్టర్ లో రవితేజ ని చూపిస్తాడని చెప్పుకుంటున్నారు. మరి ఇదే నిజమైతే ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందో చూడాలి.

Advertisement