Raviteja : రవితేజ ఖిలాడి సినిమా మీద డబుల్ కామెంట్స్.. హిట్టా ఫట్టా అని అప్పుడే చర్చలు..!

Raviteja : రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఖిలాడి. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న ఖిలాడితో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని మాస్ మహారాజ కసితో ఉన్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 28న భారీ స్థాయిలో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

raviteja-double comments on khiladi
raviteja-double comments on khiladi

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్, హాట్ యాంకర్ అండ్ నటి అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల కారణంగా ఖిలాడి సినిమాను మే 28న రిలీజ్ చేయడం డౌట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం అలాగే ఈ నెల 13, 14 తేదీల్లో రిలీజ్ కావాల్సిన ఆచార్య, నారప్ప సినిమాలను పోస్ట్‌పోన్ చేశారు.

Raviteja : రవితేజ ఖిలాడి ఎలాంటి సక్సెస్ అందుకుంటో అని టాక్ మొదలైంది.

అందుకే ఖిలాడి కూడా పోన్‌పోన్ అవుతుందని మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు ఖిలాడి అయితే విక్రమార్కుడు సినిమా మాదిరిగా భారీ హిట్ అవుతుది.. లేదంటే డిస్కోరాజా మాదిరిగా భారీ ఫ్లాప్ అవుతుందని టాక్ మొదలైంది. అందుకు కారణం రవితేజ ఈ మూడు సినిమాలలో డ్యూయల్ రోల్‌లో నటించడమే. విక్రమార్కుడు ఎంత భారి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే డిస్కోరాజా ఎలాంటి హిట్ అందుకుందో కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే ఖిలాడి ఎలాంటి సక్సెస్ అందుకుంటో అని టాక్ మొదలైంది.

Advertisement