Dhamaka : ధమాకా మరో అరుదైన మైలురాయి చేరబోతుందోచ్‌

NQ Staff - January 11, 2023 / 05:37 AM IST

Dhamaka : ధమాకా మరో అరుదైన మైలురాయి చేరబోతుందోచ్‌

Dhamaka : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ధమాకా సినిమా ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసింది.

ఇటీవలే వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన ధమాకా సినిమా తాజాగా 108 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఇదే జోరుతో కొనసాగితే త్వరలోనే 110 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.

రవితేజ మరియు శ్రీలీలా ల యొక్క జోడీకి మంచి మార్కులు పడుతున్నాయి. అంతే కాకుండా వీరి యొక్క డాన్స్ కు మాస్ ఆడియన్స్ తెగ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సినిమా కు డీసెంట్‌ షేర్ వస్తోంది. సంక్రాంతి సినిమాలు వచ్చేప్పటికి ఈ సినిమా 110 కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ దర్శకత్వం వహించాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ మాస్ మసాలా ఎంటర్‌ టైనర్ ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. అందుకే ఈ స్థాయిలో కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us