ఈ వయసులోనూ తగ్గడం లేదు.. మాస్ మహారాజా రవితేజ వీడియో వైరల్

మాస్ మహారాజా రవితేజ కూడా ఈ మధ్య సోషల్ మీడియాను దున్నేస్తున్నాడు. లాక్డౌన్ పుణ్యమా అని రవితేజ సోషల్ మీడియాలో రచ్చ చేయడం ప్రారంభించాడు. అంతకు ముందు కూడా యాక్టివ్‌గా ఉంటే వాడు కానీ ఏదో ప్రత్యేక సందర్భాల్లో గానీ స్పందించే వాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం రవితేజ పర్సనల్ విషయాలను, వర్కవుట్ల వీడియోలతో రచ్చ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఇవ్వడంలోనూ రవితేజ ముందుంటున్నాడు.

Ravi Teja Workout Video Goes Viral
Ravi Teja Workout Video Goes Viral

లాక్డౌన్‌లో రవితేజ తన ఫిట్‌నెస్‌ను భారీగా పెంచేసుకున్నాడు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసమో ఏదో లేదా క్యాజువల్‌గానే శరీరాకృతిని పెంచేశాడు. వర్కవుట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలతో హల్చల్ చేస్తున్నాడు. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక.. సినిమా సెట్‌లో ఎప్పుడెప్పుడు అడుగు పెడతానా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాడు. అలా క్రాక్ సినిమా షూటింగ్ మొదలవ్వడం ఫూల్ జాలీగా చేస్తోండటంతో రవితేజలో కొత్త ఉత్సాహాం ఉరకెలెత్తుతోంది.

ఆ విషయం ఆయన తాజాగా షేర్ చేసిన వీడియోలోనే కనిపిస్తోంది. జిమ్‌లో రవితేజ రకరకలా వ్యాయామాలు చేశాడు. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా తన దేహాన్ని ధృడపర్చుకుంటున్నాడు. చెమటను చిందించాలి.. చిరునవ్వులు చిందించాలి.. మళ్లీ అదే రిపీట్ చేయాలంటూ వర్కవుట్లు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. రవితేజ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో చేస్తోన్న క్రాక్ చిత్రంపైనే రవితేజ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

Advertisement