Ravi teja: చిరంజీవి సినిమాలో ర‌వితేజ‌.. అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు రానుందో తెలుసా?

Ravi teja: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న సినిమాల‌పై అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీలోను అమిత‌మైన ఆస‌క్తి నెల‌కొంది.”ఆచార్య” సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చిరు. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” అనే సినిమాలో నటించబోతున్నారు.

ravi-teja-to-do-a-guest-role-in-chiranjeevis-project
ravi-teja-to-do-a-guest-role-in-chiranjeevis-project

మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” సినిమాకి ఓకే చెప్పిన మెగాస్టార్ కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే బాబీ చిరంజీవి సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఒక కీలక పాత్ర పోషించనున్నారట.

బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ చేస్తున్న‌ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. పూర్తి మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బాబీ.. రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే కదా.

చిత్ర‌ కథ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోకు అవకాశం ఉంది. ఆ పాత్రను రవితేజ వంటి ఎనర్జిటిక్ హీరోతో చేయిస్తే.. బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాబీ ఈ సినిమా కోసం కలిసాడట. పైగా చిరంజీవి హీరో కావడంతో రవితేజ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. జ‌న‌వ‌రి 26న ర‌వితేజ బ‌ర్త్ డే కావ‌డంతో ఆ రోజు దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ravi-teja-to-do-a-guest-role-in-chiranjeevis-project1
ravi-teja-to-do-a-guest-role-in-chiranjeevis-project1

21 ఏళ్ల క్రితం 2000 లో “అన్నయ్య” సినిమాలో రవితేజ చిరంజీవి తమ్ముడు పాత్రలో కనిపించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో రవితేజను చూడటం ఇద్దరు హీరోల అభిమానులకి కన్నులవిందుగా ఉంటుందని చెప్పవచ్చు. సినిమాలో 40 నిమిషాల పాటు ర‌వితేజ క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.