Sri Leela : రవితేజ అభిమానుల నుంచి ‘సెగ’ ఎదుర్కొంటున్న శ్రీలీల.!

NQ Staff - December 26, 2022 / 09:05 AM IST

Sri Leela : రవితేజ అభిమానుల నుంచి ‘సెగ’ ఎదుర్కొంటున్న శ్రీలీల.!

Sri Leela : ‘శ్రీలీల మంచి డాన్సర్ అయి వుండొచ్చుగాక.. కానీ, మాస్ మహరాజ్ రవితేజ డాన్సుల ముందు దిగదుడుపే..’ అంటున్నారు రవితేజ అభిమానులు. ఇదేం కొత్త పంచాయితీ.?

రవితేజ, శ్రీలీల జంటగా వచ్చిన ‘ధమాకా’ సినిమా విషయమై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది రవితేజ అభిమానులకీ, శ్రీలీల అభిమానులకీ. శ్రీలీల పక్కన రవితేజ ముసలాడిలా కనిపిస్తున్నాడన్నది శ్రీలీల అభిమానుల వాదన.

ఏకంగా సాయిపల్లవితో పోల్చేస్తున్నారే..

డాన్సుల్లో సాయి పల్లవి కంటే చాలా చాలా బెటర్ శ్రీలీల.. అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇది మరీ టూమచ్.! సాయి పల్లవి ఎక్కడ.? శ్రీలీల ఎక్కడ.?

ఇక, రవితేజ డాన్సుల్ని శ్రీలీల మ్యాచ్ చేయగలిగిందా.? శ్రీలీల డాన్సుల్ని రవితేజ మ్యాచ్ చేయగలిగాడా.? అన్న చర్చ జరగడానికి కారణం అక్కినేని నాగార్జున. బిగ్ బాస్ వేదికపై నాగార్జున.. అటు రవితేజ, ఇటు శ్రీలీల.. ఇద్దర్నీ డాన్సుల విషయంలో ఇరకాటంలో పడేశారు.

అది కాస్తా ముదిరి వివాదంగా మారింది. రవితేజ అభిమానులకీ, శ్రీలీల అభిమానులకీ.. మధ్య ఎవరి డాన్సు గొప్ప.? అన్న విషయమై గొడవ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us