Ravi teja: ర‌వితేజ అదృష్టం మాములుగా లేదు.. కొద్దిలో మిస్..!

Ravi teja: మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ చాలా స్పీడు మీదున్నాడు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ర‌వితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడి” విడుదలకు సిద్ధం అవుతోంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో “రామారావు ఆన్ డ్యూటీ” అనే మరో సినిమా షూటింగ్ లో ప్రస్తుతం రవితేజ బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాస్ మహారాజా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ravi teja escapes from flop2
ravi teja escapes from flop2

ర‌వితేజ‌.. రామారావు ఆన్ డ్యూటీతో పాటు ప‌లు చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ అనే చిత్రం కూడా ప్రారంభం అయింది. రవితేజ ఈ ఏడాది క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తో శుభారంభం చేశాడు. క్రాక్ ముందు రవితేజ నుంచి వచ్చిన నేల టికెట్టు, డిస్కోరాజా, అమర్ అక్బర్ ఆంటోని లాంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి.

క్రాక్ తర్వాత రవితేజ కెరీర్ మళ్ళీ గాడిలో పడింది. ఇలాంటి సమయంలో పొరపాటు చేయకూడదు. ఆ విషయంలో రవితేజ అదృష్టం బావుందని ప్రచారం జరుగుతోంది. ఓ డిజాస్టర్ చిత్రం నుంచి రవితేజ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ర‌వితేజ న‌టించిన అనుభ‌వించు రాజా చిత్రం ఇటీవల విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది.

శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్, ఖాశీస్ ఖాన్ జంటగా నటించారు. మొదట దర్శకుడు ఈ చిత్ర కథతో రవితేజని సంప్రదించాడట. కన్నీరు రవితేజ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే అంశాలు కొన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. కానీ కథ పూర్తిగా బలంగా లేకపోవడంతో రవితేజ ఈ చిత్రానికి నో చెప్పినట్లు తెలుస్తోంది.

ravi teja escapes from flop
ravi teja escapes from flop

దీనితో దర్శకుడు రాజ్ తరుణ్ ని సంప్రదించి ఓకే చేయించుకున్నాడు. అన్న పూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. దీనితో రవితేజ తెలివిగా వ్యవహారించి పెద్ద పరాజయం నుంచి తప్పించుకున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ యాక్షన్ మిక్స్ అయి ఉండే చిత్రాలకే ఒకే చెబుతున్నారు. కామెడీ, విలేజ్ డ్రామా చేసే మూడ్ లో రవితేజ లేనట్లు తెలుస్తోంది.