Ravi Teja: విచార‌ణ‌కు త‌న డ్రైవ‌ర్‌తో హాజ‌రైన ర‌వితేజ‌.. అనేక కోణాల‌లో విచారించ‌నున్న ఈడీ

Ravi Teja: టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న‌విష‌యం తెలిసిందే. డ్రగ్స్ వ్యవ‌హారంతో పాటు మ‌నీ ల్యాండ‌రింగ్ విష‌యంపై ఈడీ అధికారులు లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి కౌర్, నందు, రానా ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.

Ravi Teja arrived at the ED office
Ravi Teja arrived at the ED office

నిన్న దయం 10 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానాను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్‌ సరఫరా దారుడు కెల్విన్‌తో సంబంధాలు, ఎఫ్‌ క్లబ్‌లో పార్టీలు, అక్కడ పార్టీలు జరుపుకొనే తీరు, ఎవరెవరు పార్టీలకు హాజరయ్యేవారు? అనే విష‌యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కెల్విన్‌ గురించి ఆరా తీయగా తనకు తెలియదని రానా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

Ravi Teja arrived at the ED office
Ravi Teja arrived at the ED office

ఈడీ విచారణంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. తాజాగా ఈడీ కార్యాలయానికి మాస్ రాజా రవితేజ హాజరయ్యాడు. కొద్దీ సేపటి క్రితమే రవితేజ , ఆయ‌న డ్రైవ‌ర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. రవితేజ బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశీలించనున్నారు. మనీలాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించనున్నారు అధికారులు .


టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలకంగా ఉన్న కెల్విన్‌ను ఈడీ అధికారులు ప్రతి సారి విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలిసింది. డ్రగ్స్‌ సరఫరాతోపాటు పలువురు సినీ ప్రముఖులతో కెల్విన్‌కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి కెల్విన్‌కు డబ్బులు వచ్చాయని, వాటిని తిరిగి అంతర్జాతీయ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ అత‌నిని లోతుగా ద‌ర్యాప్తు చేయ‌నున్నారు.