Ravi Kishan : నేను కూడా కాస్టింగ్ కౌచ్ కు గురయ్యా.. రేసుగుర్రం విలన్ కామెంట్లు వైరల్..!

NQ Staff - March 28, 2023 / 02:30 PM IST

Ravi Kishan : నేను కూడా కాస్టింగ్ కౌచ్ కు గురయ్యా.. రేసుగుర్రం విలన్ కామెంట్లు వైరల్..!

Ravi Kishan : సినిమా ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశాలు రావాలంటే కచ్చితంగా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాల్సిందే అన్నట్టు పరిస్థితులు తయారైపోయాయి. అయితే ఇన్ని రోజులు మహిళలు మాత్రమే కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కుంటున్నారు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు పురుషులకు కూడా ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే కొందరు మగవారు తమకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురయినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటుడు ముందకు వచ్చాడు. ఆయన ఎవరో కాదండోయ్ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం మూవీలో స్టైలిష్‌ విలన్ గా నటించిన రవి కిషన్. తెలుగులో ఆయన కొన్ని సినిమాల్లో విలన్ గా నటించారు.

కెరీర్ స్టార్టింగ్ లో..

ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. నేను కూడా కెరీర్ స్టార్టింగ్ లో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నాను. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా అది కామన్ అయిపోయింది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ మహిళ పరిచయం అయింది.

ఆమె నన్ను రాత్రి కాఫీ తాగడానికి రమ్మని చెప్పింది. నాకు విషయం అర్థం అయి వెంటనే నో చెప్పాను. ప్రస్తుతం ఆ మహిళ ఇండస్ట్రీలో పెద్ద స్థాయిలో ఉంది అంటూ తెలిపాడు రవికిషన్. ఆయన చేసిన కామెంట్లతో పురుషులకు కూడా ఇబ్బందులు తప్పవన్న మాట అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us