Ravi Babu : సీనియర్ నటుడు చలపతిరావు.! ఆ ఒక్క ‘మచ్చ’ తప్ప.!

NQ Staff - December 25, 2022 / 03:41 PM IST

Ravi Babu : సీనియర్ నటుడు చలపతిరావు.! ఆ ఒక్క ‘మచ్చ’ తప్ప.!

Ravi Babu : నటనా రంగంలో 1200కి పైగా సినిమాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు సీనియర్ నటుడు చలపతిరావు. ఆయన ఇక లేరు. ఆయన నటించిన ఎన్నో పాత్రలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతాయి.

ఎంతో మందికి తన తండ్రి సాయం చేసేవారనీ, తాను నటనా రంగంలోకి వచ్చాక చాలామంది, వారు పొందిన సాయం గురించి చెప్పారనీ చలపతిరావు తనయుడు, సినీ నటుడు, దర్శకుడు రవిబాబు, తన తండ్రి తుది శ్వాస విడిచిన విషయాన్ని వెల్లడిస్తూ చెమర్చిన కళ్ళతో చెప్పారు.

ప్రశాంతంగా చనిపోయారు..

ప్రశాంతంగా చలపతిరావు తుదిశ్వాస విడిచారని రవిబాబు చెప్పారు. అయితే, సోషల్ మీడియాలో చలపతిరావు ఒకప్పుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.

ఓ సినిమా ఫంక్షన్ సందర్భంగా లేడీ యాంకర్ అడిగిన ప్రశ్నకు చలపతిరావు ‘అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు..’ అనడం వివాదాస్పదమైంది. మహిళా సంఘాలు ఆందోళన చేయడంతో, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు చలపతిరావు క్షమాపణ కూడా చెప్పారు.

ఆనాటి ఆ వివాదం, చలపతిరావు మరణం నేపథ్యంలో ఇంకోసారి చర్చకు వస్తోంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us