Ravanasura: రావ‌ణాసుర పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిరంజీవి.. చిత్ర‌బృందానికి స్పెష‌ల్ విషెస్

Ravanasura: మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ క్రాక్ చిత్రంతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఆయ‌న వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం మాస్ మహారాజ రవితేజ- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Ravanasura pooja cemery
Ravanasura pooja cemery

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన మేకర్స్ నేడు పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ పూజకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు.

Ravanasura pooja cemery
Ravanasura pooja cemery

న‌టీన‌టుల‌పై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అలానే చిత్ర బృందానికి స్పెష‌ల్ విషెస్ తెలియ‌జేశారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ పది గెటప్పులో కనిపించనున్నాడట.

Ravanasura pooja cemery
Ravanasura pooja cemery

ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లకు సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, శ్రీకాంత్‌ విస్సా కథ అందించారు. పలు ఆసక్తికర అంశాలతో మూవీ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు మేకర్స్‌.ఇటీవ‌ల రామ్ రామ్‌ పాత్రలో అలరించనున్న సుశాంత్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఆ ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే సుశాంత్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Ravanasura pooja cemery
Ravanasura pooja cemery

అలాగే ఈ మూవీలో అందాల తార దక్షా నాగర్కర్‌ విలన్‌గా చేయనున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఇక సుధీర్ వ‌ర్మ విష‌యానికి వ‌స్తే ‘స్వామిరారా’ సినిమాతో దర్శకుడిగా సుధీర్ వర్మ తొలి ప్రయత్నంతోనే విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత చేసిన ‘దోచేయ్’ .. ‘కేశవ’ .. ‘రణరంగం’ ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ‘రావణాసుర’ చేస్తున్నాడు. టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. అతి త్వ‌ర‌లోనే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లి ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.