Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని క‌లిసేందుకు యూఎస్ వెళుతున్న ర‌ష్మిక‌.. ఏం జ‌రుగుతుంది..!

Rashmika: సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ ఉంటాయి. హిట్ పెయిర్‌గా టాక్ వస్తే వారికి ఉండే డిమాండ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఆ ఇద్దరి మధ్యే ఏదో నడుస్తోందనే రూమర్లు కూడా వస్తుంటాయి. అలా రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ జోడిపై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్లు కోకొల్లలుగా వచ్చాయి.

rasmika where she is traveling1
rasmika where she is traveling1

విజయ్ రష్మికకు సంబంధించిన మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇక ఆ మధ్య రష్మిక చేసిన లైవ్ చాట్.. విజయ్ మీద చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. విజయ్ మంచి స్నేహితుడు అంటూ రష్మిక చెప్పిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి.

ఇక ఇటీవ‌ల‌ ఇద్దరూ జిమ్‌లో వింత వింత పోజులు పెట్టేశారు. వర్కవుట్లు మానేసి సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. వారిద్దరూ అలా పోజులు ఇస్తే.. నేను మాత్రం ఇలా ఫన్నీగా చేస్తుంటాను అని రష్మిక ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక మళ్లీ సపరేట్‌గా విజయ్ దేవరకొండతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

ర‌ష్మిక మేట‌ర్ వ‌స్తే త‌ప్ప‌క విజ‌య్ దేవ‌ర‌కొండ టాపిక్ కూడా ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. తాజాగా ర‌ష్మిక త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం? అని అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొంటూ ఆమె విమాన ప్రయాణం, పాస్‌పోర్ట్ చిత్రాలను పంచుకుంది.

ఆమె దీన్ని షేర్ చేసినప్పటి నుండి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్మిక అభిమానులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆమె ఆన్‌లైన్‌లో షేర్ చేసిన చిత్రాలలో ఒకదానిలో “ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్నా.. నేను త్వరలో తిరిగి వస్తాను” అని రాసింది.

rasmika where she is traveling2
rasmika where she is traveling2

అయితే రష్మిక యునైటెడ్ స్టేట్స్ వెళ్లిందని, అక్కడ పూరి జగన్నాధ్ “లైగర్” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా యుఎస్‌ షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్న తన సహనటుడు, బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను కలవడానికి రష్మిక అక్కడికి వెళ్ళింది అంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు రష్మిక ‘లైగర్’ గెస్ట్ రోల్ లో కన్పించబోతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.