Rashmika: నేను ఎవ‌రిని చంప‌ద‌లుచుకోలేదంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన ర‌ష్మిక‌

Rashmika: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న ర‌ష్మిక సినిమాల‌తోనే కాకుండా సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ‌కు అంద‌రు మంత్ర‌ముగ్ధులవుతున్నారు. తెలుగులోకి ఛ‌లో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ర‌ష్మిక‌. ఆ సినిమా కూడా హిట్ కావ‌డంతో ర‌ష్మిక క్రేజ్ పెరిగింది.

అదృష్టంతో పాటు క‌లుపుగోలుత‌నం కూడా క‌లిసి రావ‌డంతో ర‌ష్మిక మంద‌న‌, త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప ది రైజ్ చిత్రాల్లో న‌టించింది. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా రేంజ్ మూవీ కావ‌డంతో ర‌ష్మిక మంద‌న‌కు క్రేజ్ మ‌రింత పెరిగింది.

రష్మిక నిత్యం తన అభిమానులో కలిసి చిట్ చాట్ చేస్తుంటుంది. ఫ్యాన్స్‌తె టచ్‌లోఉండేందుకే రష్మిక ప్రయత్నిస్తుంటుంది. షూటింగ్‌లు లేకుండా ఇంట్లోఖాళీగా ఉంటే కచ్చితంగా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఏదో ఒక ప్రశ్న వేసి క్విజ్ లాంటిది పెడుతూ ఉంటుంది.రష్మిక ఇక ఆదివారం నాడు కాస్త రెస్ట్ తీసుకున్నట్టుంది.

తన ఇన్ స్టాలో అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్‌లాంటిది పెట్టేసింది. మీ మైండ్‌లో ఏమైనా ఉందా? అడిగేయండనే టైపులో పెట్టేసింది. ఏం చేయాలో కూడా నాకు సలహా ఇవ్వండని అడిగేసింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా సలహాలు ఇచ్చారు.పెట్స్‌తో ఆడుకోండి అని ఒక నెటిజన్ అంటే.. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అని చెప్పింది.

బీటీఎస్ సాంగ్స్ వినండి.. వాటికి డ్యాన్స్ చేయండి. ఆ వీడియోలను షేర్ చేయండని అడిగింది. పాటలు విన్నాను, డ్యాన్స్ చేశాను కానీ పోస్ట్ చేయను అని చెప్పింది. అలా ఒక్కో నెటిజన్ ఒక్కో రకంగా సలహా ఇచ్చాడు. చివరకు ఓ నెటిజన్ మాత్రం వంట చేయండి అని సలహా ఇచ్చాడు. ఇక వంటచేసి నేను ఎవ్వరినీ చంపాలని అనుకోవడం లేదంటూ రష్మిక సెటైర్ వేసింది.