Rashmika Mandanna : ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది.. విజయ్ కు షాక్ ఇచ్చిన రష్మిక..!
NQ Staff - May 15, 2023 / 03:50 PM IST

Rashmika Mandanna : రష్మిక ఇప్పుడు అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్ వరకు అన్ని భాషల్లో తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆమె చాలా ముందు జాగ్రత్తతో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఒక భాషకు పరిమితం కాకుండా అన్ని భాషల్లో ఏక కాలంలో తన సినిమాలు వచ్చేలా చూసుకుంటోంది.
ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటుంది. ఎందుకంటే ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోందనే రూమర్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇద్దరూ కలిసి మాల్దీవులకు టూర్లకు కూడా వెళ్తున్నారు. అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకుంటారని అంతా అనుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చే కామెంట్లు చేసింది రష్మిక. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచి తమిళ దళపతి విజయ్ కు చాలా పెద్ద అభిమానిని. ఆయన సినిమాల పోస్టర్లను నా దగ్గర దాచుకునే దాన్ని. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఆయనతో డేటింగ్ చేయాలని అనుకునేదాన్ని.
అలాంటి నాకు ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆయనతో నటించడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన లాంటి మంచి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు అంటూ కామెంట్లు చేసింది రష్మిక. ఆమె చేసిన వ్యాఖ్యలు విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చేలా ఉన్నాయంటున్నారు రౌడీ ఫ్యాన్స్.