Rashmika mandanna : అందుకే బాలీవుడ్ హీరోకి నో చెప్పాను…. రష్మిక మందన్న

Rashmika mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో దూసుకుపోతోంది. తెలుగులో పుష్ప సినిమా చేస్తోంది. సుకుమార్అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. అక్టోబర్ 13న 5 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు దర్శక, నిర్మాతలు. ఇక కొరటాల శివ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో తాజాగా ఒక సినిమా అనౌన్స్ అయింది. ఈ సినిమాలో రష్మిక పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

rashmika-mandanna-says no to bollywood hero
rashmika-mandanna-says no to bollywood hero

కాగా బాలీవుడ్‌లో రష్మిక మందన్న రెండు సినిమాలు చేస్తోంది. యంగ్ హీరో సిద్దార్థ్ మల్‌హోత్రకి జంటగా మిషన్ మజ్ఞు సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురుగా ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్‌లో రష్మిక స్టార్ హీరోయిన్ అవడం ఖాయమంటున్నారు. అయితే బాలీవుడ్‌లో ఒక స్టార్ హీరోకి రష్మిక మందన్న నో చెప్పిందట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. షాహిద్ కపూర్. రష్మిక రిజెక్ట్ చేసిన సినిమా టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ హిందీ రీమేక్.

Rashmika mandanna : రష్మిక మందన్న ఇంత నిర్మొహమాటంగా నో చెప్పడానికి కారణం శ్రద్ద శ్రీనాథ్.

అయితే రష్మిక మందన్న ఇంత నిర్మొహమాటంగా నో చెప్పడానికి కారణం శ్రద్ద శ్రీనాథ్. జెర్సీ తెలుగు వెర్షన్‌లో శ్రద్ద శ్రీనాథ్ అద్భుతంగా నటించింది. తను తప్ప ఈ క్యారెక్టర్ మరో హీరోయిన్ చేయలేదన్నంత బాగా చేసింది. అందుకే రష్మిక ఈ సినిమా హిందీ వెర్షన్‌లో రష్మికని చేయమంటే నో చెప్పిందట. ఇక కోలీవుడ్‌లో రష్మిక నటించిన డెబ్యూ సినిమా సుల్తాన్ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ ప్రేక్షకుల్లో.. మేకర్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Advertisement