Rashmika Mandanna : ర‌ష్మిక స్పీడ్ మూములుగా లేదు.. మ‌రోసారి సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న‌..!

Rashmika Mandanna : క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందాన ఇటీవ‌లి కాలంలో జోరు మీదుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో న‌టిస్తుంది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించిన ర‌ష్మిక ఇప్పుడు మ‌రోసారి మ‌హేష్‌తో జోడిక‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది. సూప‌ర్‌స్టార్ మహేశ్ ప్ర‌స్తుతం ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌ర్కారువారి పాట చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 1కి వాయిదా ప‌డింది.

Rashmika Mandanna one more super star movie
Rashmika Mandanna one more super star movie

స‌ర్కారువారి పాట మూవీ త‌ర్వాత మ‌హేష్ బాబు స్టార్ డైరెక్ట‌ర్‌, రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. మ‌హేశ్ కోసం త్రివిక్ర‌మ్ వెయిట్ చేస్తున్నారు. అలాగే తన సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంటున్నారు త్రివిక్ర‌మ్‌. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Rashmika Mandanna one more super star movie
Rashmika Mandanna one more super star movie

సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ మూవీలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉండ‌బోతున్నారు. ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టించ‌నుంద‌ని టాక్ వినవ‌స్తోంది. కాగా.. మ‌రో హీరోయిన్‌గా ఎవ‌రినీ తీసుకోవాల‌ని త్రివిక్ర‌మ్ చాలా ప్ర‌య‌త్నించార‌ట‌. తాజాగా రెండో హీరోయిన్ పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి ర‌ష్మిక మంద‌న్న‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం.

ద‌క్షిణాది చిత్రాల‌తో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ర‌ష్మిక మంద‌న్న స్టార్ హీరోయిన్ క్రేజ్‌తో పూజా హెగ్డేకు పోటీగా వ‌చ్చేసింది. ఇలాంటి త‌రుణంలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా చేస్తుందా? అనేది ఆలోచించాల్సిన విష‌య‌మే. త‌న మాతృ సంస్థ‌లాంటి హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధా కృష్ణ (చిన‌బాబు) నిర్మాణంలో ఈ సినిమా రూపొంద‌నుంది.

అత‌డు, ఖలేజా చిత్రాల‌కు మ‌హేశ్‌- త్రివిక్ర‌మ్ జోడీ క‌లిసి వ‌ర్క్ చేసింది. అత‌డు ఓ మోస్తరు రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. కానీ బుల్లితెర‌పై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. ఇక ఖ‌లేజా అయితే డిజాస్ట‌ర్ టాక్‌తో డీలా ప‌డింది. ఈ సినిమా 2010లో విడుద‌లైంది. మ‌ళ్లీ 11 ఏళ్ల త‌ర్వాత మ‌హేశ్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రాబోతుంది. నిజానికి మ‌హేశ్ త‌న త‌దుప‌రి సినిమాను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సి ఉంది. అయితే రాజ‌మౌళి ఇంకా RRR రిలీజ్‌తోనే బిజీగా ఉన్నారు.