Rashmika mandanna : రష్మిక మందన్న అంత తీసుకోవట్లేదా… అయితే నిర్మాతలు కాస్త ఆలోచించాల్సిందే..?

Rashmika mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. కిరాక్ పార్టీ అన్న సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్ లో యంగ్ హీరో నాగ శౌర్య కి జంటగా ఛలో సినిమాతో పరిచయం అయింది. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ కావడం తో రష్మిక కి తెలుగులో వరసగా ఆఫర్స్ వచ్చి హిట్స్ అందుకుంది. దీంతో పూజా హెగ్డే .. కీర్తి సురేష్ లతో పోటీ పడుతూ రేస్ లో ఉంది.

rashmika-mandanna-not taking that much remunaration
rashmika-mandanna-not taking that much remunaration

చెప్పాలంటే టాలీవుడ్ లో కాస్త అటు ఇటుగా టాప్ వన్ లో ఉన్నట్టే అంటున్నారు. ఇక కోలీవుడ్ లో సుల్తాన్ అన్న సినిమాతో పరిచయం అయింది. కార్తీ ఈ సినిమాలో హీరో. అలాగే బాలీవుడ్ లో కూడా రష్మిక మందన్న రెండు సినిమాలకి సైన్ చేసింది. సిద్దార్థ్ మల్‌హోత్రా కి జంటగా మిషన్ మజ్ఞు అన్న సినిమాతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో క్రేజీ సినిమాలు. దాంతో రష్మిక మందన్న కి రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Rashmika mandanna : రష్మిక మందన్న రిక్వెస్ట్ ని మేకర్స్ కాస్త ఆలోచిస్తే బావుంటుందేమో.

ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కంటే ఎక్కువే రెమ్యూనరేషన్ బాలీవుడ్ లో అందుకుంటుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న రేంజ్ పాన్ ఇండియన్ హీరోయిన్ కాబట్టి ఒక్కో సినిమాకి తెలుగులోనే 2 కోట్లు తీసుకుంటుందని బాలీవుడ్ లో ఈ రెమ్యూనరేషన్ ఇంకా ఎక్కువ ఉంటుందని ప్రచారం అవుతోంది. కాని ఈ విషయంలో రష్నిక క్లారిటీ ఇస్తూ నిజంగా తనకి 2 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఉంటే బావుంటుందని సెటైర్ వేసింది. దీంతో రష్మిక రెమ్యూనరేషన్ టాలీవుడ్ లోనే 2 కోట్లు లేదని అర్థమవుతోంది. మరి ఈ టాలెంటెడ్ హీరోయిన్ రిక్వెస్ట్ ని మేకర్స్ కాస్త ఆలోచిస్తే బావుంటుందేమో.

Advertisement