Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో లిప్ లాక్.! రష్మిక ఎందుకు ఏడ్చేసిందో తెలుసా.?

NQ Staff - October 4, 2022 / 04:43 PM IST

Rashmika Mandanna  : విజయ్ దేవరకొండతో లిప్ లాక్.! రష్మిక ఎందుకు ఏడ్చేసిందో తెలుసా.?

Rashmika Mandanna  : తెరపై లిప్ లాక్ సీన్స్‌కి వుండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజుల్లో యూత్‌ఫుల్ సినిమా అంటే, అందులో లిప్ లాక్ వుండి తీరాల్సిందే. సీనియర్ హీరోలు కూడా, యంగ్ హీరోయిన్లతో లిప్ లాక్స్ కోసం ఆరాటపడుతున్న రోజులివి.

లిప్ లాక్ సీన్స్ అన్నీ, ప్రేక్షకుల్ని అలరించడం కోసమేనా.? నటీనటుల మధ్య వేరే కక్కుర్తి కోసమా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తుంటాయి.

రష్మిక లిప్ లాక్ పెట్టింది.. ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది..

కన్నడ కస్తూరి రష్మిక మండన్న తెలుగులో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. రెండింటి లోనూ లిప్ లాక్ సీన్స్ వుంటాయ్. ఆ సన్నివేశాలు చేసినప్పుడెలా అనిపించింది.? ఆ తర్వాత ఎదుర్కొన్న విమర్శల సంగతేంటి.? అన్న విషయమై రష్మిక తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఓ ఇంటర్వ్యూలో.

‘ఆ సినిమాల్లో ఆయా సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ, వాటిపై ట్రోలింగ్ జరిగినప్పుడు చాలా బాధ కలిగింది. ఒంటరిగా ఏడ్చేదాన్ని. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు..’ అంటూ రష్మిక మండన్న అప్పట్లో తాను పడ్డ పాట్లు గురించి చెప్పుకొచ్చింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us