Rashmika Mandanna : హైద‌రాబాద్‌లో త‌ళుక్కుమన్న ర‌ష్మిక‌.. పొట్టి దుస్తుల‌లో కేక పెట్టిస్తుందిగా..!

Rashmika Mandanna : ఛలో సినిమాతో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు షార్ట్ గ్యాప్‌లో స్టార్ స్టేట‌స్ సంపాదించింది. ప్ర‌స్తుతం పుష్ప అనే చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తుండ‌గా, చిత్రంలో పాత్ర‌ల‌న్నింటిని మాస్ లుక్‌లో చూపిస్తున్నాడు.

Rashmika Mandanna Latest Visuals At Hyderabad
Rashmika Mandanna Latest Visuals At Hyderabad

ఇప్పటికే ‘పుష్ప’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్‌, పాటలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఇందుకోసం స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ కూడా మాస్‌ లుక్‌ చూపించారు సుకుమార్‌. అప్పటివరకు స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తూ వచ్చిన బన్నీ ఈ సినిమాలో ఊర మాస్‌ లుక్‌లో ఉన్న లారీ డ్రైవర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇక నేషనల్‌ క్రష్‌ రష్మికను కూడా డీగ్లామర్‌ పాత్రలో చూపిస్తున్నారు. ఇప్పటికే రష్మికకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

 

వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ర‌ష్మిక‌. తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. పెద్ద ఎత్తున ఈ అమ్మడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలతోపాటు తన సినిమాలకు సంబందించిన అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది. దాంతో ఈ బ్యూటీకి నెట్టింట ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడికి 23.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక కేవలం 394 ఇన్ స్టా పోస్ట్ లతో 23 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

ఈ అమ్మ‌డు తెలుగు, హిందీ సినిమాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుండి ముంబై కి చక్క‌ర్లు కొడుతుంది. తాజ‌గా హైద‌రాబాద్‌లో త‌ళుక్కుమన్న ఈ అమ్మ‌డు పొట్టి దుస్తుల‌లో క్యూట్‌గా క‌నిపించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది.