Rashmika Mandanna: ర‌ష్మిక సంపాద‌న తెలిస్తే అవాక్క‌వ్వ‌డం ఖాయం..!

Rashmika Mandanna నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన చార్మింగ్ బ్యూటీ ర‌ష్మిక‌. లక్కీబ్యూటీ అనే ట్యాగ్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న ఈ చిన్నది. మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసింది. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకుంది. దీంతో ర‌ష్మిక రేంజ్ పెరిగింది.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో నటిస్తోంది రష్మిక. అలాగే తమిళ్ , హిందీ బాషలపైనా కూడా ఈ అమ్మడు దృష్టి పెడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా చిత్రాలు,బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించే అవకాశం రావడంతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ కూడా కోట్లలోనే తీసుకుంటున్నట్లు సమాచారం.

ర‌ష్మిక ఇప్పుడు ప్ర‌తి సినిమాకు కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఆమె సంపాద‌న‌కు సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ర‌ష్మిక ఇటీవ‌ల ముంబైలో ఖ‌రీదైన బంగ్లా కొనుగోలు చేయ‌గా, బెంగళూరులో ఆమెకు ఆరు నుండి 8 కోట్లు విలువ చేసే బంగ్లా ఒక‌టి ఉంద‌ట‌.

సుమారుగా 30 నుండి 45 కోట్లు సంపాదించిన ర‌ష్మిక ల‌గ్జ‌రీ లైఫ్‌ని మెయింటైన్ చేస్తుంది. కాస్ట్యూమ్స్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు కూడా లక్షలు పెట్టి కొంటారని తెలుస్తోంది. అదేవిధంగా రష్మికకు కార్లంటే యమ పిచ్చి ఈ క్రమంలోనే తన గ్యారేజ్ లో ఆడి క్యూ 3,రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ, ఇన్నోవా క్రిస్టా, హ్యుండాయ్‌ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

ప్ర‌స్తుతం ర‌ష్మిక‌కు నిర్మాత‌లు 4 నుండి 5 కోట్ల వ‌ర‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. ఈ క్ర‌మంలో బాగానే సంపాదిస్తుంద‌ని చెబుతున్నారు. ఈ అమ్మ‌డు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టిన నటి రష్మిక అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గతంలో ఐటీ అధికారులు ఆమె ఇంటి పై దాడి చేశారని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఐటీ అధికారులు దాడి చేసింది త‌న‌పై కాద‌ని, త‌న తండ్రి ఆస్తుల‌పై ర‌ష్మిక వివ‌ర‌ణ ఇచ్చింది.