Rashmika Mandanna: ర‌ష్మిక సాలిడ్ పంచ్.. దెబ్బ త‌గిలితే దిమ్మ‌తిర‌గడం ఖాయం..!

Rashmika Mandanna ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన.. అనతికాలంలోనే అనేక హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా మారింది. బాలీవుడ్‌లో కూడా మంచి అవ‌కాశం అందుకుంటున్న ర‌ష్మిక‌.. మిషన్ మజ్ను, గుడ్ బై వంటి భారీ బాలీవుడ్ చిత్రాలు చేస్తుంది.

TheNewsQube-

ఇండియా వైడ్ ఫేమ్ రాబట్టిన రష్మిక పలు బ్రాండ్స్ కి అంబాసడర్ గా వ్యహరిస్తున్నారు. ప్రచార కర్తగా తన సంపాదన అధికం చేసుకున్నారు రష్మిక. ఈ సౌత్ ఇండియన్ స్టార్ కు ఇన్ స్టా గ్రాంలో 21 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇది ఆమెకున్న ఫాన్ ఫాలోయింగ్ ను క్రేజ్ ను తెలుపుతుంది.

ఫోర్బ్స్ భారతదేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన నటుల’ జాబితాలో నటి రష్మిక మంద‌న్నా అగ్రస్థానం సంపాదించింది. సమంత, విజయ్ దేవరకొండ, యష్‌, అల్లు అర్జున్ వంటి హేమ‌హేమీల‌ను దాటుకుంటూ టాప్‌కి చేరింది. బెంగుళూరుకు చెందిన రష్మిక తెలుగు, త‌మిళ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది.

త్వ‌ర‌లోనే సిద్ధార్థ్ మ‌ల్హోత్రాకి జోడిగా న‌టిస్తుండ‌డంతో ఉత్త‌రాదిన కూడా పాపులారిటీ సంపాదించింది. దీంతో సౌత్‌లోని మంచి మంచి న‌టుల‌ను దాటుకుంటూ ఈ జాబితాలో అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. యంగ్ ఏజ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుని పాన్ ఇండియన్ సినిమాలు చేసే లెవెల్ కి కూడా వచ్చేసింది.

రష్మికా మందన్నా ఓ పక్క గ్లామర్ తో పాటు అదిరే డాన్స్ లు ఫిట్నెస్ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందని తెలుసు. తాజాగా తన ట్రైనీ తో కిక్ బ్యాగ్ పై సాలిడ్ పంచ్ లు ఇస్తూ గట్టిగా కష్టపడుతుంది. దీనితో ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే వారాల తరబడి ఉండాల్సి వస్తున్న నేపథ్యంలో ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేశారట. ముంబైలో ఇల్లు కొన్నాక, ఆమెకు కంఫర్ట్ గా అనిపిస్తుందట.