Rashmika mandanna : రష్మిక మందన్న విజయ్ దేవరకొండతో నేను రెడి.

Rashmika mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా విపరీతమైన క్రేజ్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ మూడు చోట్లా చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లో పుష్ప సినిమా చేస్తోంది. పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషల్లో తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అఫీషియల్ గా కూడా రిలీజ్ డేట్ లాక్ చేశారు.

rashmika-mandanna is ready to act with vijay devarakonda...?
rashmika-mandanna is ready to act with vijay devarakonda…?

అయితే ప్రస్తుతం కరోనా కారణంగా టాలీవుడ్ సహా అన్నీ చిత్ర పరిశ్రమలలో సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అంతేకాదు రిలీజ్ డేట్స్ కూడా మారిపోయాయి. ఈ క్రమంలో చక చకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాల పరిస్థితి ఇప్పుడు కష్టతరంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో పుష్ప కి భారీ పోటీ ఉండే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక తాజాగా మరో సినిమాకి సైన్ చేయబోతున్నట్టు స్వయంగా వెల్లడించింది. మొత్తం మూడు సినిమాలతో బాలీవుడ్ లో సందడి చేయబోతోంది.

Rashmika mandanna : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ జంటని మళ్ళీ చూడాలనుకుంటున్నారు.

అయితే అభిమానులకు రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ జంటని మళ్ళీ చూడాలనుకుంటున్నారు. వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవిందం తో పాటు డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. ఒక బ్లాక్ బస్టర్ ఒక సినిమా భారీ డిజాస్టర్. అయినా ప్రేక్షకుల్లో రష్మిక – విజయ్ పేయిర్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే తాజాగా ఒక అభిమాని మళ్ళీ మీ కాంబినేషన్ చూడాలనుకుంటు అడుగగా కథ సెట్ అయితే మా ఇద్దరికి ఓకే. మేము కలిసి సినిమా చేసేందుకు రెడీగా ఉన్నామంటూ తెలిపింది.

Advertisement