Chiranjeevi : చిరంజీవి స‌ర‌స‌న కుర్ర బ్యూటీనా… ఈ కాంబినేష‌న్ సెట్ అవుతుందా…!

Chiranjeevi : ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి దాదాపు 9 ఏళ్ల పాటు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తదనంతరం 2017లో వచ్చిన ఖైదీ నెంబర్‌ 150 సినిమాతో చిరు గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిదేళ్లు గడిచినా తనలో స్టామిమా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన చిరు.. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Rashmika Mandanna in Chiranjeevi movie
Rashmika Mandanna in Chiranjeevi movie

అనంతరం 2019లో సైరా నర్సింహా రెడ్డితో ఆకట్టుకున్న చిరు.. తర్వాత అనివార్యంగా గ్యాప్‌ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను ఓకే చెప్పేస్తున్నాడు. ఇప్పటికే మూడు నాలుగు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. అయితే తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాకు చిరు ఓకే చెప్పాడనే టాక్ ఆ మధ్య వచ్చింది.

Rashmika Mandanna in Chiranjeevi movie
Rashmika Mandanna in Chiranjeevi movie

అందుకే చిరంజీవిని రెండు మూడు సార్లు ఆ మధ్య కలిసి వచ్చాడట. అయితే తాజాగా ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి చేయబోతోన్నాడని, అందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఫిక్స్ అయిందని సమాచారం.

అయితే చిరంజీవి ఇప్పుడు ఆచార్య సినిమాను పూర్తి చేశాడు. లూసిఫర్‌ రీమేక్ గాడ్ ఫాదర్‌ను సెట్స్ మీద ఉరకలెత్తిస్తున్నాడు. ఈ మధ్య వేదాళం రీమేక్ అయిన భోళా శంకర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత బాబీ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా షూటింగ్‌ను మొదలుపెడతాడు. ఇవన్నీ పూర్తయిన తరువాతే కొత్త సినిమాను మొదలు పెట్టాల్సి ఉంటుంది.

అంటే వచ్చే ఏడాది చివర్లో ఇంకో కొత్త సినిమాను చిరు ప్రారంభించే అవకాశం ఉంటుంది. వెంకీ కుడుములతో దాదాపు సినిమా కన్ఫామ్ అయిపోయిందని, అందులో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ కాంబినేషన్ మీద రూమర్లు రావడంతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. తండ్రీ కూతుళ్లుగా, తాత మనవారిగానా? అంటూ నానా రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.

చిన్న రూమర్‌గానే ఈ వార్త బయటకు వస్తే ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. రేపో మాపో అది అఫీషియల్ అని ప్రకటన వస్తే కథ ఎలా ఉంటుందో.. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని టాక్.