Rashmika Mandanna : ఆ పాపను ఎలాగైన కల్పించండి ప్లీజ్ అంటున్న రష్మిక మందన్నా
NQ Staff - September 15, 2022 / 01:27 PM IST

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన కి ఒక చిన్నారి తెగ నచ్చేసింది.. దేశం మొత్తం రష్మిక మందన ని ఇష్టపడుతూ ఉంటే ఇప్పుడు రష్మిక మందన ఆ చిన్నారిని కలుసుకొని ముద్దులు పెట్టాలని కోరుకుంటున్నట్లుగా ఈ అమ్మడు పేర్కొంది.
అసలు విషయానికి వస్తే పుష్ప
సినిమాలోని స్వామి స్వామి పాట కి ఒక చిన్నారి క్యూట్ గా డాన్స్ చేసింది. బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పాప చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల మంది చూసిన ఆ వీడియో ఇప్పుడు రష్మిక మందన వద్దకు చేరింది.
దాంతో వీడియో చూసిన తర్వాత రష్మిక మందన ఎలాగైనా ఆ పాపను కలవాలని ఉంది.. దయచేసి ఎవరైనా ఆ పాపను నాకు కల్పించండి అంటూ విజ్ఞప్తి చేసింది. ఆ పాప తెలుగు వర్షన్ పాటకి డాన్స్ చేయలేదు కనుక అమ్మాయి తెలుగు అమ్మాయి అయ్యి ఉండదు.

Rashmika Mandanna Impressed Cute Dance of the Child
వేరే భాషకు చెందిన ఆ పాపని అతి త్వరలోనే రష్మిక మందన కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి.. కానీ రష్మిక మందనాన్ని ఈ వీడియో చాలా ఆకర్షించినట్లుగా ఉంది.
అందుకే దయచేసి ఆ పాపను కల్పించండి అంటూ విజ్ఞప్తి చేస్తుంది.. ఆ పాప కలిస్తే రష్మిక ఆనందాన్ని చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. నేషనల్ క్రష్ కి క్రష్ కలిగించిన ఆ చిన్నారి నిజంగా అదృష్టవంతురాలు మరియు టాలెంటెడ్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ తో కలిసి వారసుడు సినిమాలో నటిస్తోంది.. హిందీలో పలు సినిమాలను చేస్తుంది, తెలుగులో ఎన్టీఆర్ 30 సినిమాలు ఇటీవలే ఎంపికైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ అమ్మడు బిజీ బిజీగా సినిమాల్లో నటిస్తోంది.
Maaaaadddddeeeeee myyyyy daaaaaay.. I want to meet this cutie..?
how can I? ? https://t.co/RxJXWzPlsK— Rashmika Mandanna (@iamRashmika) September 14, 2022