Rashmika Mandanna: బాబోయ్ ర‌ష్మిక రోజురోజుకి త‌న హాట్ డోస్ పెంచేస్తుందిగా..!

Rashmika Mandanna: క‌న్న‌డ పిల్ల ర‌ష్మిక దూకుడు మాములుగా లేదు.తెలుగు, త‌మిళం, మ‌లయాళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదుంది ర‌ష్మిక మంద‌న్నా. ఈ భామ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప సినిమా చేస్తుంది. మ‌రోవైపు హిందీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టిన ఈ బ్యూటీ సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి స్పై థ్రిల్ల‌ర్ మిష‌న్ మ‌జ్ను చేస్తోంది.అలానే అమితాబ్‌తో క‌లిసి ఓ సినిమా చేస్తుంది.

Rashmika Mandanna Hot Looks
Rashmika Mandanna Hot Looks

శాండ‌ల్‌వుడ్ బ్యూటీకి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌డంతో ఈ అమ్మ‌డు ఫాలోయింగ్ కూడా భారీగా పెరుగుతుంది. గత ఏడాది నేషనల్ క్రష్‌గా ఎంపికైన ఈ రష్మిక మందన్నా.. అప్పుడప్పుడూ అందాల విందుతో అంద‌రిని త‌న వైపుకు తిప్పుకుంటుంది. ఛ‌లో నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాల వ‌ర‌కు ర‌ష్మిక చాలా ట్రెడిష‌నల్‌గానే క‌నిపించింది. ఎప్పుడైతే బాలీవుడ్‌కి వెళ్లిందో బ‌ట్ట‌ల సైజు త‌గ్గించ‌డం మొద‌లు పెట్టింది.

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. శాండిల్‌వుడ్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కిర్రాక్ పార్టీ’తో హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో పాటు గ్లామర్‌తో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ‌.. ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే ‘ఛలో’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ప్రవేశించింది. మొదటి సినిమాతోనే హిట్‌ను అందుకుని టాలీవుడ్‌లోకి అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది.

ఛ‌లో తర్వాత ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మ‌ధ్య‌లో ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి.అయితే ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ర‌చ్చ చేస్తున్న ర‌ష్మిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. అదే సమయంలోనే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది.

రష్మిక మందన్నా బిజీ షెడ్యూల్ కారణంగా ఇండియా మొత్తం చక్కర్లు కొడుతోంది. తాజాగా ఎయిర్‌పోర్ట్‌కి వ‌చ్చిన ర‌ష్మిక రెడ్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ కేక పెట్టిస్తుంది. క‌న్న‌డ పిల్ల‌లో మార్పుని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. చూస్తుంటే ర‌ష్మిక రానున్న రోజుల‌లో గ్లామ‌ర్ డోస్ మ‌రింత పెంచ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.