Rashmika Mandanna : మేనేజర్ తో గొడవలపై స్పందించిన రష్మిక మందన్నా.. అది నిజమే అంటూ..!
NQ Staff - June 23, 2023 / 07:01 PM IST

Rashmika Mandanna : రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ భామ. ప్రస్తుతం హిందీలో యానిమల్ సినిమాతో పాటు తెలుగులో పుష్ప-2 సినిమాలో నటిస్తోంది. కాగా రీసెంట్ గా ఆమె తన మేనేజర్ చేతిలో మోసపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ మేనేజర్ ను కంటిన్యూ చేస్తోంది రష్మిక. కాగా ఆయన మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన్ను తీసేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా రష్మిక, ఆమె మేనేజర్ ఓ ప్రకటన చేశారు. మేం ఇద్దరం చాలా సన్నిహితులం.
ఎవరి కెరీర్ లో వారు ఎదగాలనే ఉద్దేశంతోనే విడిపోతున్నాం. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఇదే నిజం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. మా పనికి మేం కట్టుబడి ఉంటాం అంటూ తెలిపింది రష్మిక. ఆమె చేసిన ప్రకటనలో ఎక్కడ కూడా వివాదాలకు చోటివ్వలేదు రష్మిక.
దీంతో ఇద్దరి నడుమ మోసం జరిగిందనే వార్తలపై ఇలా క్లారిటీ వచ్చేసిందన్నమాట. కానీ మోసం జరిగిందన్న వార్తలపై ఆమె స్పందించలేదు. కేవలం విడిపోతున్నట్టు మాత్రమే తెలిపింది.