Rashmika Mandanna Dropped New Project : ఆ నిర్ణయంతో 10 కోట్లు పోగొట్టుకున్న రష్మిక.. అయ్యో అలా జరిగిందా?
NQ Staff - September 2, 2023 / 10:11 AM IST

Rashmika Mandanna Dropped New Project :
ఒక్కోసారి మనం తీసుకునే చెత్త నిర్ణయాలు కెరీర్ లో ఎంతో నష్టాలను మిగులుస్తాయి.. మరి ఇప్పుడు నేషనల్ క్రష్ కూడా ఒక చెత్త నిర్ణయం వల్ల ఏకంగా 10 కోట్లు లాస్ అయ్యిందట.. మరి ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి ? ఎందుకు ఈమెకు లాస్ వచ్చింది అంటే?.. ఇటీవలే రష్మిక మందన్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే..
ఇప్పటికే ఈ కాంబోలో భీష్మ వంటి సూపర్ హిట్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. రెండవ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయడంతో వీరి లేటెస్ట్ ప్రాజెక్ట్ పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి.. అయితే ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వీడియోలో కూడా ఉన్న రష్మిక ఈ సినిమా నుండి తప్పుకుంది. అందుకు కారణం బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన అవకాశం రావడమే..

Rashmika Mandanna Dropped New Project
షాహిద్ కపూర్, రష్మిక జంటగా ఒక సినిమాలో నటిస్తున్నారు. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. అయితే షాహిద్, నితిన్ సినిమాల మధ్య డేట్స్ క్లాష్ అవ్వడంతో రష్మిక నితిన్ సినిమా నుండి తప్పుకుంది. షాహిద్ సినిమా అయితే బాలీవుడ్ లో మరింత క్రేజ్ వచ్చి ఇంకా ఆఫర్స్ వస్తాయి కాబట్టి ఈ అమ్మడు నితిన్ సినిమా నుండి బయటకు వచ్చింది.
ఈ సినిమా నుండి తప్పుకుని చివరి నిముషంలో అమ్మడు టీమ్ కు షాక్ ఇచ్చింది.. కానీ ఈ భామ ఒకందుకు ఆలోచిస్తే మరొకటి అయ్యింది. ఈమె ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యి షాహిద్ కపూర్ మూవీ ఆగిపోయింది. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. షాహిద్ కోసం నితిన్ మూవీ నుండి సైడ్ అయ్యింది. ఇప్పుడు మొత్తానికి రెండు లేకుండా పోవడంతో ఈమెకు 10 కోట్ల లాస్ వచ్చిందట. ఈమె తొందరపడి తీసుకున్న నిర్ణయమే ఈమె లాస్ కు కారణం అంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.