Rashmika Mandanna : చీరకట్టు శ్రీవల్లి అంతకు మించి.. ఇలా నీకే సాధ్యం అంటూ ఫ్యాన్స్ పొగడ్తలు

NQ Staff - September 30, 2022 / 10:44 AM IST

Rashmika Mandanna : చీరకట్టు శ్రీవల్లి అంతకు మించి.. ఇలా నీకే సాధ్యం అంటూ ఫ్యాన్స్ పొగడ్తలు

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇటీవల హిందీ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్ళిన రష్మిక మందన అక్కడ వరుస హాట్‌ ఫోటో షూట్స్ తో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పొట్టి డ్రెస్ లు, క్లీ వేజ్‌షో లతో ఆమె రచ్చ చేసింది. గత రెండు మూడు రోజులుగా ఆమె ఏకధాటిగా సోషల్ మీడియాలో హాట్‌ ఫొటోస్ తో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ వీడియో మళ్లీ రష్మిక అభిమానులను మరియు నెటిజన్స్ ని తెగ ఆకర్షిస్తుంది.

చీర కట్టులో కారు దిగుతూ విమానాశ్రయంలోకి వెళ్తున్న రష్మిక మందన నీ ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ పోటీ పడ్డారు. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ఆమెపై ఫోటోగ్రాఫర్స్ ప్రశంసలు కురిపించడం ఆమె ముసి ముసిగా నవ్వుతూ సిగ్గుపడుతూ కెమెరాలకు ఫోజు ఇవ్వడం ఈ వీడియోలో చూడవచ్చు.

చీరకట్టులో కూడా ఇంత అందం కేవలం శ్రీవల్లి రష్మిక మందనకి మాత్రమే సాధ్యమంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్కిన్ షో చేయకుండా ఇంత క్యూట్ గా రష్మిక ని చూడడం కొత్తగా ఉందని, పొట్టి డ్రెస్ ల్లో కంటే.. అంతకు మించి అందంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్‌.. సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో కూడా ఈమె నటించబోతుంది. తమిళంలో విజయ్ కి జోడిగా వారసుడు సినిమాలో నటిస్తోంది.

ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయంటూ ఈ అమ్మడు అధికారికంగా సైన్ చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయంటూ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి సౌత్ ఇండియా నుండి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన ఎదిగింది అనడంలో సందేహం లేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us