Rashmika Mandanna : రష్మికపై కన్నడ సినీ పరిశ్రమలో బ్యాన్.! ఆ సినిమాల పరిస్థితేంటి.?

NQ Staff - November 24, 2022 / 08:16 PM IST

Rashmika Mandanna : రష్మికపై కన్నడ సినీ పరిశ్రమలో బ్యాన్.! ఆ సినిమాల పరిస్థితేంటి.?

Rashmika Mandanna : ‘నీకసలు విశ్వాసం అనేదే లేదా.?’ అంటూ కన్నడ సినీ అభిమానులు, నటి రష్మిక మండన్నపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రష్మిక మండన్నది కర్నాటక. కన్నడ సినిమాలనుంచే ఆమె నటనా ప్రస్థానం ప్రారంభమైంది. ‘కిరిక్ పార్టీ’ నటిగా ఆమెకు తొలి సినిమా.

అయితే, తాను నటించిన తొలి సినిమా, ఆ సినిమాకి సంబంధించిన నిర్మాణ సంస్థ పేర్లను ప్రస్తావించేందుకు రష్మిక ఇష్టపడటంలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ, తనకు నటిగా తొలి అవకాశమిచ్చిన నిర్మాణ సంస్థ గురించీ, దర్శకుడు అలాగే నిర్మాత గురించీ పేర్కొనలేదు.

బ్యాన్ చేసి తీరాల్సిందే..

ఈ నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమలో రష్మికపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్మిక నటించిన సినిమాల్ని థియేటర్లలో ప్రదర్శించకూడదని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అసలు ఆమెతో సినిమాలు రూపొందించకూడదని దర్శక నిర్మాతలు, నటీనటులు డిసైడ్ అయ్యారట.

అదే గనుక నిజమైతే, రష్మిక నటించిన ‘వారిసు’ సినిమా త్వరలో విడుదల కావాల్సి వుంది. కన్నడ సినీ పరిశ్రమలో ఈ సినిమా విడుదలవ్వకపోతే ఎలా.? ‘పుష్ప ది రూల్’ పరిస్థితి ఏమవుతుంది.?
చిత్రమేంటంటే, కర్నాటకలో రష్మికకి సాలిడ్ ఫ్యాన్ బేస్ వున్నా, వాళ్ళు సైతం రష్మిక తీరుని సమర్థించలేక పోతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us