Rashmika Mandanna : రష్మిక ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలుసా.. స్టార్ హీరోయిన్లలో ఆమెనే టాప్..!
NQ Staff - April 1, 2023 / 12:21 PM IST

Rashmika Mandanna : కన్నడ నుంచి వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు చాలా లక్ ఉంది. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. పైగా మామూలు హిట్లు కూడా కావు. ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిపోయాయి. అందుకే ఆమె ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయిందని చెప్పుకోవాలి.
పుష్ప సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్ నుంచి భారీ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తోంది. దీంతో పాటు పుష్ప-2 సినిమాలో కూడా నటిస్తోంది ఈ భామ. దాంతో పాటు తమిళంలో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉండగా ఆమె సంపాదనకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఆమె ఒక్కో మూవీకి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల దాకా తీసుకుంటోంది. పైగా చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది రష్మిక . ఒక్కో యాడ్ కోసం ఆమె రూ.2 కోట్ల తీసుకుంటోంది. ఇలా సినిమాలు, బ్రాండ్ వాల్యూస్ తో కలిసి ఆమె ఏడాది సంపాదన రూ.25 కోట్లుగా ఉంది.
ఆమె మొత్తం ఆస్తి విలువ కలిపి రూ.175 కోట్లు అని సమాచారం. ఆమె ఇంకో పదేండ్ల వరకు సినిమాల్లో చేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎంత లేదన్నా ఇంకో రూ.300 కోట్ల దాకా సంపాదించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.