IPL Starting Ceremony : ఐపీఎల్ వేడుకలో డ్యాన్స్ చేసిన రష్మిక, తమన్నా ఎంత తీసుకున్నారో తెలుసా..?
NQ Staff - April 1, 2023 / 02:23 PM IST

IPL Starting Ceremony : ఇప్పుడు సౌత్ స్టార్లకు చాలా క్రేజ్ పెరుగుతోంది. హీరోలకే కాకుండా హీరోయిన్లకు చాలా బడా ఆఫర్లు వస్తున్నాయి నార్త్ నుంచి. నేషనల్ వైడ్ గా తెరకెక్కే ప్రాజెక్టుల్లో కూడా మన సౌత్ భామలకే అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం తమన్నా, రష్మిక బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు అందుకుంటున్నారు.
ఇక తాజాగా వీరిద్దరూ ఐపీఎల్ స్టార్టింగ్ వేడుకలో డ్యాన్స్ చేసే ఆఫర్ అందుకున్నారు. ఇప్పటి వరకు మన సౌత్ భామలకు ఈ ఆఫర్ దక్కలేదు. కానీ మొదటిసారి వీరిద్దరూ ఆడిపాడి మన సౌత్ ఇండస్ట్రీ పరువు నిలబెట్టారు. రష్మిక, తమన్నా డ్యాన్స్ చేస్తున్నంత సేపు స్టేడియంలో అరుపులు, ఈలలతో మార్మోగిపోయింది.
ఆ పాటకు డ్యాన్స్..
తమన్నా మోడ్రన్ డ్రెస్ లో అలరిస్తే.. రష్మిక సంప్రదాయ లెహంగాలో మెరిసింది. ఇందులో ఇద్దరూ తమ అందాలను బాగానే ఆరబోశారు. ఇక రష్మిక నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు వీరిద్దరూ ఇలా డ్యాన్స్ చేయడానికి తీసుకున్న రెమ్యునరేషన్ వైలర్ అవుతోంది.
ఐపీఎల్ వేడుకలో డ్యాన్స్ చేసేందుకు రష్మిక రూ.5కోట్లు చార్జ్ చేసిందంట. అలాగే తమన్నా రూ.3కోట్లతో సరిపెట్టుకునిందంట. రష్మికకు ఉన్న క్రేజ్ ను బట్టి ఆమె భారీగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎంతైనా ఐపీఎల్ అంటే ఆ మాత్రం ఇవ్వాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్.