Rashmika: మూడు సెక‌న్ల‌లో ప్రేమలో పడ్డానంటూ రష్మిక మందన్న సోషల్ మీడియా పోస్ట్

Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు దేశవిదేశాల నుండి వచ్చి తమ ప్రతిభ, అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమందైతే తంతే బూరెల బుట్టలో పడ్డట్లు మొదటి సినిమాతోనే హైప్ క్రియేట్ చేసుకుంటారు. అందులోనూ టాలీవుడ్ చిత్ర సీమ కొత్తవారిని, టాలెంట్ ఉన్నవారిని పైకి తెస్తుంది. ప్రేక్షకులు కూడా విశేషంగా అభిమానిస్తారు. ఇక ఒక్కసారి ఫ్యాన్ అయ్యారంటే వాళ్ళు ఓ రేంజ్ కి చేరుకునేవరకు నిద్రపోరు. అటు సోషల్ మీడియాలో కూడా తెగ హల్ చల్ చేస్తుంటారు. అలా ఈ లిస్ట్ లోకి కన్నడ భామ రష్మిక మందన్నా మొదటి స్థానం లో ఉంటుంది. నాగశౌర్య హీరోగా, రష్మిక హీరోయిన్ గా ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

Rashmika Mandanna

గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. లేటెస్ట్ గా మన రష్మిక లవ్ లో పడిందట. ఎప్పుడూ యాక్టివ్ ఉండే ఈ అమ్మాయి చేసిన పోస్ట్ తో నెటిజన్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అసలు విషయం ఏంటంటే.. రష్మిక మందన్న కేవలం మూడు సెకన్లలో ప్రేమలో పడిందంట. ఆ ప్రేమలో పడింది తన క్యూట్ పెట్ తో అంటూ చెప్పుకొచ్చింది. దాని పేరు జౌరా. ప్రస్తుతం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన లిటిల్ పెట్ జౌరాను తన అభిమానులకు పరిచయం చేస్తున్నా అంటు తనతో పాటు దిగిన పెట్ ఫోటోను షేర్ చేసింది.

Rashmika Mandanna

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు కూడా రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలకు తెగ లైకులు, కామెంట్లతో పాటు షేర్లు చేస్తున్నారు. పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా చేస్తుంది. ఇదిలా ఉండగా రష్మిక తన టాలెంట్ ని బీటౌన్ లో పరీక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్ నటిస్తుంది.