Rashmika Mandanna రష్మిక మందాన్న ఇప్పుడు ఎంతటి స్టార్డంను ఎంజాయ్ చేస్తోందో అందరికీ తెలిసిందే. ఎక్కడో శాండిల్ వుడ్లో చిన్నగా మొదలైన కెరీర్, ప్రేమ నిశ్చితార్థం ఆ పై పెళ్లితో కెరీర్ మొత్తం ముగిసిపోవాల్సింది. కానీ ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్‌గా మారేంత స్థాయికి ఎదిగింది. అదంతా ఛలో సినిమా పుణ్యమే. తెలుగులో చేసిన మొదటి సినిమానే భారీగా హిట్ కొట్టడంతో రష్మిక దశ తిరిగింది. తెలుగులో ఓ కొత్త హీరోయిన్ మెరిస్తే అందంగా ఉంటే.. మొదటి సినిమానే భారీ సక్సెస్ అయితే ఆఫర్లు వెల్లువెత్తుతాయన్న సంగతి తెలిసిందే.
అలా రష్మికకు రెండో సినిమా గీతగోవిందం వచ్చింది. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా రష్మిక గోల్డెన్ హ్యాండ్‌గా మారింది. అలా రష్మిక కెరీర్లో రోజూ రోజూకు స్టార్డం పెరుగుతూనే వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమాతో టోటలో సౌత్‌లో ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్లో రష్మిక స్టార్ హీరోయిన్గా మారింది. గతేడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది.

ఇప్పుడు రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటు తెలుగు, అటు తమిళంలోనూ రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్యే రష్మికకు బాలీవుడ్‌లొ ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా వస్తోన్న సినిమాలో రష్మిక హీరోయిన్గా ఎంపికైంది. ఇలా దూసుకుపోతోన్న రష్మికకు ఇక ఎంతటి ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా తన అభిమానులు చేసిన పనిని చూసిన రష్మిక ఎమోషనల్ అయింది.
రష్మిక మందాన్న ఎమోషనల్.. Rashmika Mandanna
మామూలుగా అయితే హీరోల అభిమానులే సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు హీరోయిన్ల ఫ్యాన్స్ కూడా సమాజ సేవ చేస్తుంటారు. తాజాగా రష్మిక ఫ్యాన్స్ తన పేరుగా మీదు చారిటీని పెట్టి.. సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. రక్తదానం, అన్నదానం వంటి సేవ కార్యక్రమాలను చేస్తున్నారు. వాటిని చూసిన రష్మిక ఎమోషనల్ అయింది. మీరు చేసిన ఈ పనికి నా కంట్లోంచి నీరు వస్తోంది.. ఎంతో గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.