Rashmika Mandana : సినిమాల‌లోకి రావొద్దంటున్న ర‌ష్మిక‌.. ఎందుకో తెలుసా?

 

Rashmika Mandana : దక్షిణాది అందాల తార రష్మిక మందాన.. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు వరస విజయాలతో దూసుకుపోతోంది. కాగా.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే.. ఆమెకు నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా వచ్చేసింది.

రష్మిక.. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప లో నటించారు. అందులో శ్రీవల్లి పాత్రలో ఆమె జీవించారనే చెప్పాలి. డీ గ్లామర్ రోల్ అయినా… ఆమె చాలా అందంగా కనిపించడం విశేషం. ర‌ష్మిక నేచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. రష్మిక తన చర్మ సంరక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట.

rashmikamandanna
rashmikamandanna

ఈ నేపథ్యంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ వైరల్‌గా మారింది. లేజర్‌ ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత ఎర్రగా కందిపోయిన తన చేయి ఫొటోను పంచుకున్న ఆమె ‘ మీలో ఎవరైనా మాలాగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారా? వద్దు అని చెప్పింది.

సినీ ప‌రిశ్మ‌లో ఎన్నో ఇబ్బందులు, కష్టాలుంటాయి. ఉదాహరణకు ఇలా ఎన్నోసార్లు లేజర్‌ ట్రీట్‌మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం రష్మిక దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.

rashmikamandanna
rashmikamandanna

ఈ ముద్దుగుమ్మ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌ బై ‘ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బెంగళూరు బ్యూటీ.