Allu Arjun: అల్లు అర్జున్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అందాల హీరోయిన్.. థ్యాంక్యూ డియ‌ర్ అంటూ బ‌న్నీ ట్వీట్

Allu Arjun: అల్లు అర్జున్ , ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ సినిమాని చాలా చ‌క్క‌గా చెక్కుతున్నాడు. ఇప్పటికే ‘పుష్ప’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్‌, పాటలు సినిమా ఎలా తెర‌కెక్కుతుంద‌నే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఇందుకోసం స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ కూడా మాస్‌ లుక్‌ చూపించారు సుకుమార్‌.

rashmika gifts to allu arjun
rashmika gifts to allu arjun

అప్పటివరకు స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తూ వచ్చిన బన్నీ ఈ సినిమాలో ఊర మాస్‌ లుక్‌లో ఉన్న లారీ డ్రైవర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇక నేషనల్‌ క్రష్‌ రష్మికను కూడా డీగ్లామర్‌ పాత్రలో చూపిస్తున్నారు. ఇప్పటికే రష్మికకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

ర‌ష్మిక కూడా ఈ చిత్రంలో చాలా డీ గ్లామ‌ర్‌గా క‌నిపించ‌నుంది. అయితే పుష్ప‌లో బ‌న్నీతో ర‌చ్చ చేస్తున్న ర‌ష్మిక ఇప్పుడు బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది. తాజాగా స్టైలిష్ స్టార్ ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసారు. అందులో తనకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపినందుకు రశ్మికకు ధన్యవాదాలు తెలిపాడు.

rashmika-gifts-to-allu-arju
rashmika-gifts-to-allu-arju

సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లో రష్మిక ఒక ప్రత్యేక నోట్ కూడా పంపింది. అందులో “మీకు ఏదైనా స్పెషల్ గా పంపాలని అనిపించింది సర్. పుష్ప కోసం మనకు ఆల్ ది బెస్ట్… లవ్, రష్మిక” అని ఉంది. ఈ సర్ప్రైజ్ కు ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు అర్జున్ రష్మికకు కృతజ్ఞతలు తెలిపాడు. “పుష్ప ది రైజ్” డిసెంబర్ 17న తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల కానుంది.

బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తున్న రష్మిక… ముంబైలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను మూవీ చేస్తున్న ఆమె, అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఆడాళ్లు మీకు జోహార్లు మూవీలో ర‌ష్మిక‌ హీరోయిన్ గా చేస్తున్నారు. ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటున్న మిషన్ మజ్ను, గుడ్ బై, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు షూట్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు రష్మిక.