RASHMIKA: యంగ్ రెబ‌ల్ స్టార్‌తో డేట్‌కు వెళ‌తానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ర‌ష్మిక‌

సౌత్ ఇండ‌స్ట్రీలో అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్ పొందిన హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌. ఛ‌లో సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత గీతా గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ వంటి చిత్రాల‌ల‌లో న‌టించింది. ఈ చిత్రాల‌తో టాప్ హీరోయిన్ స్టేట‌స్ అందుకున్న ఈ అమ్మ‌డు ఇప్పుడు పెద్ద హీరోల సినిమా ఆఫ‌ర్స్ అందుకుంటుంది. ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇందులో గిరిజన యువతిగా కనిపించనుందని తెలుస్తుంది.

ర‌ష్మిక‌కు తెలుగులోనే కాదు తమిళం, హిందీలోను అనేక ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. రానున్న రోజుల‌లో ర‌ష్మిక మార్కెట్ మ‌రింత‌గా పెర‌గడం ఖాయమ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌గా, ఇవి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. యాంక‌ర్ మీరు డేటింగ్‌కు వెళ్లాల్సి వ‌స్తే ఎవ‌రితో వెళ‌తార‌ని అడగ‌గా, అందుకు బ‌దులిచ్చిన ర‌ష్మిక నాకు ప్ర‌భాస్ అంటే ఇష్టం. ప్ర‌భాస్‌తో డేట్‌కు వెళ్లేందుకు నేను ఇష్ట‌ప‌డ‌తాను అని పేర్కొంది. శర్వానంద్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలోను ర‌ష్మిక న‌టిస్తున్న విష‌యం విదిత‌మే.