RASHMI GAUTHAM: ఒక్క రూపాయి ఇచ్చినా చాలు.. ర‌ష్మీ గౌత‌మ్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

క‌రోనా వ‌ల‌న నిన్న‌టి వ‌ర‌కు మంచిగా బ్రతికిన వారు కూడా ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. కరోనా చికిత్స కోసం ల‌క్ష‌లు ల‌క్ష‌లు బిల్లులు చెల్లిస్తుండ‌డంతో వారి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప‌లువురు సెల‌బ్రిటీలు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా ర‌ష్మీ గౌతమ్ ఓ డ్యాన్స‌ర్ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని కోరింది. డ్యాన్స‌ర్ పవిత్ర ప‌రిస్తితి గురించి మీ అంద‌రికి తెలిసే ఉంటుంది. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రికి కరోనా పాజిటివ్ రావ‌డంతో ఆమె త‌న పేరేంట్స్‌కు చికిత్స చేయించ‌లేక‌పోతుంది. దురదృష్టవశాత్తూ వైద్యం సరిగ్గా అందకో, మరే విషయమో తెలియదు కానీ ఆమె తండ్రి ప్రాణాలు విడిచారు. వాళ్లు ఆర్థికంగా ఉన్నవాళ్లు కాదు. కాబట్టి మనందరం వారికి సాయం చేద్దాం.

Rashmi Gautam New Pics

 

నా ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇందులో ప్ర‌తి ఒక్క‌రు త‌లా ఒక్క రూపాయి ఇవ్వండి చాలు. క‌నీసం రెండు ల‌క్ష‌ల రూపాయ‌లైన పోగు చేసి వారికి ఇద్దాం. అంద‌రం క‌ష్ట కాలంలోనే ఉన్నాం అని తెలుసు. పవిత్ర ప‌రిస్థితి మ‌న‌కంటే దారుణంగా ఉంది. ఆమెకు మ‌నం అండ‌గా ఉందాం అని ర‌ష్మీ పేర్కొంది. అయితే ర‌ష్మీ విజ్ఞ‌ప్తిని ఆలకించిన అభిమానులు రెండు ల‌క్ష‌లు సాయం చేశారు. ఆ మొత్తాన్ని ప‌విత్ర కుటుంబానికి అందించారు. మంచి ప‌ని కోసం త‌న‌కు స‌పోర్ట్‌గా ఉన్న ఫ్యాన్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది ర‌ష్మీ. గ‌తంలోను ఈ అమ్మ‌డు చాలా సేవా కార్య‌క్ర‌మాలు చేసింది.

Advertisement