Rashmi: అందరినీ అడుక్కోవడం వల్లే ఇలా అయ్యావ్.. సుధీర్‌పై రష్మీ కామెంట్స్
NQ Staff - March 19, 2021 / 01:15 AM IST

Rashmi సుడిగాలి సుధీర్ రష్మీ కాంబో అంటే అందరికీ ఇష్టమే. ఈ ఇద్దరి కెమిస్ట్రీకి ఫిదా కానీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. గత ఏడు ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ జంటకు ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో రష్మీ సుధీర్ చేసే కామెడీని వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఈ ఇద్దరి మీద చేసిన ఈవెంట్లు అయితే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మీ సుధీర్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. ప్రతీ సారి తమ స్కిట్లలో రష్మిని తీసుకురావడం, ఏదోలా సెటైర్లు వేయడం, రష్మి కూడా వాటిని ఎంతో స్పోర్టివ్‌గా తీసుకోవడంతో స్కిట్లు బాగానే వర్కవుట్ అవుతుంటాయి. అయితే ప్రతీసారి స్కిట్లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం పీక్స్‌లో ఉంటుంది.
తాజాగా వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో సుధీర్ టీం వెరైటీ స్కిట్ వేసింది. ఆ మధ్య సుధీర్‌కు సీమంతం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ స్కిట్ సీక్వెల్లా సుధీర్‌కు బిడ్డ పుట్టాడట. దాని గురించి ఓ స్కిట్ వేశారు. ఇందులో ఆ బిడ్డను నిద్రపుచ్చడానికి సుధీర్ జోల పాట పాడాడు.
సుధీర్ పై రష్మీ కామెంట్స్: Rashmi
అడిగా అడిగా అంటూ సుధీర్ తన ల్యాండ్ మార్క్ పాటను పాడాడు. దీంతో రష్మీ సూపర్ కౌంటర్ వేసింది. అందరినీ అలా అడిగావ్ కాబట్టే ఇలా అయింది నీకు అంటూ బిడ్డ పుట్టడంపై సుధీర్‌ను ఆట ఆడుకుంది. మొత్తానికి ఇలా స్కిట్ల మధ్యలో రష్మీ వేసే పంచ్‌లు బాగానే వైరల్ అవుతుంటాయి.