NAGARJUNA: నాగార్జున‌తో క‌లిసి న‌టించనున్న బుల్లితెర బ్యూటీ.. ఈ సారి అదృష్టం ఎలా ఉంటుందో..!

బుల్లితెర బ్యూటీలు ఛాన్స్ దొరికితే వెండితెర‌పై అదృష్టం ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే అందాల భామ అన‌సూయ బుల్లితెర‌పై సంద‌డి చేస్తూనే వెండితెర‌పై త‌న స‌త్తా చూపిస్తుంది. యంగ్ హీరో సినిమాల‌తో పాటు స్టార్ హీరో సినిమా ఆఫ‌ర్స్ కూడా అందుకుంటుంది. ఇక మ‌రో టీవీ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ కూడా బుల్లితెర‌పై అల‌రిస్తూ వెండితెర‌పై త‌న స్టామినా చూపించాల‌ని క‌ల‌లు కంటుంది. టీవీ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టిన రష్మీ.. అక్కడ కూడా అందాల ఆరబోతకు సై అంటోంది. ప్రేక్షకులను అలరించడానికి అమ్మడు ఎల్లప్పుడూ రెడీనే అంటుంది.

Rashmi Gautam Beautiful Black Saree Pics
 

ర‌ష్మీ ప‌లు టీవీ షోస్, సినిమాలు చేసిన‌ప్ప‌టికీ జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం తెచ్చిన క్రేజ్ మ‌రేది తేలేదు అంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికి ప‌రిమిత‌మైన ర‌ష్మీ గౌతమ్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్‌తో అప్పుడ‌ప్పుడు చిట్ చాట్ చేస్తుంటుంది. అలానే త‌న‌కు తోచినంత సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తుంటుంది. అయితే సైడ్ క్యారెక్టర్స్ తో పాటు హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించిన ర‌ష్మీ గౌత‌మ్ కు గుంటూరు టాకీస్ చిత్రం మంచి విజ‌యం అందించిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు మ‌రో మంచి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తుండ‌గా ర‌ష్మీకి కింగ్ నాగ్ – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదివరకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనే గుంటూరు టాకీస్ సినిమా చేసి మంచి గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని వరుసగా పలు గ్లామరస్ మూవీస్ చేసింది. అలాగే కింగ్ నాగ్ బ్యానర్ లో రూపొందిన యువ అనే టీవీ సీరియల్ ద్వారా పరిచయమైంది రష్మీ. ఇప్పుడు ఆయన సినిమాలో ఆయన పక్కనే క్యారెక్టర్ చేయనుందట. ఇదే నిజ‌మైతే ర‌ష్మీ బంపర్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టే అంటున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.