Rashmi: తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే రెండు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానం దక్కుతోంది. అలాంటి వారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. దాదాపు ఐదారేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ బ్యూటీ ఒకవైపు పలు షోస్ చేస్తూనే మరోవైపు గ్లామర్ షోతో మెప్పిస్తూ ఉంటుంది.

అప్పుడెప్పుడో రష్మీ గౌతమ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది.

అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జబర్ధస్త్’ అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది.

బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుడిగాలి సుధీర్, రష్మీలకి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే.

ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. జంతువులకి ఎవరైన హాని తలపెట్టారో వెంటనే స్పందిస్తూ ఉంటుంది.

మరోవైపు సోషల్ మీడియాలోను గ్లామర్ షోతో రచ్చ చేస్తుంటుంది. రష్మీ గౌతమ్. ఈ అమ్మడి గ్లామర్ షోకి కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతుంటారు.

తాజాగా రష్మీ గౌతమ్ నీలి రంగు డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. ఈ అమ్మడి క్యూట్ పిక్స్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. రష్మీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రష్మీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.