Rashmi Gautam: బ్లూ క‌ల‌ర్ శారీలో హోయ‌లు పోయిన ర‌ష్మీ గౌత‌మ్

Rashmi Gautam: బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్దిన అందాల యాంక‌ర్స్‌లో ర‌ష్మీ గౌత‌మ్ ఒక‌రు. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కేవ‌లం త‌న ప‌ర్స‌న‌ల్ అప్‌డేట్స్ కాక స‌మాజంకి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను అందులో చ‌ర్చిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూగ‌జీవాల విష‌యంలో ర‌ష్మీ ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌రుస్తూ ఉంటుంది.


Rashmi Gautam Stuns in Blue Saree
Rashmi Gautam Stuns in Blue Saree


ఆకట్టుకునే అందం.. అద్భుతమైన అభినయం.. అదిరిపోయే హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న ర‌ష్మీ గౌతమ్ దాదాపు పదేళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో మంచి పాత్రలను పోషించింది. అయిన ర‌ష్మీకి పెద్ద‌గా కాలం క‌లిసి రాలేదు. ఎప్పుడైతే అన‌సూయ పోయి ర‌ష్మీ జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌చ్చిందో ఇక అప్ప‌టి నుండి ర‌ష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింది.


Rashmi Gautam Stuns in Blue Saree
Rashmi Gautam Stuns in Blue Saree


గ్లామరస్ పాత్రలతో కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేసిన రష్మీ గౌతమ్.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ మారింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో లీడ్ రోల్ చేసింది. ‘గుంటూరు టాకీస్’తో మాత్రమే విజయాన్ని అందుకుంది. మిగిలినవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న పుకార్లే ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.


Rashmi Gautam Stuns in Blue Saree
Rashmi Gautam Stuns in Blue Saree


‘ఢీ’ షోలోనూ ఈ జోడీ తెగ హల్‌చల్ చేస్తోంది. మెంటర్లుగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తూ అప్పుడప్పుడూ మజాను పంచుతున్నారు. ఇక అప్పుడ‌ప్పుడు వెరైటీ డ్రెస్‌ల‌లో ఫొటో షూట్స్ చేస్తూ అల‌రిస్తూ ఉండే ర‌ష్మీ గౌత‌మ్ తాజాగా నీలి రంగు చీర‌లో మెరిసిపోయింది. హోయ‌లు పోతున్న‌ట్టుగా ఫొటోల‌కు ఫోజులిచ్చిన ర‌ష్మీ త‌న క్యూట్ లుక్స్‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.