Rashmi Gautam : జబర్దస్త్ వయ్యారం.! పర్పుల్ షైన్స్‌లో రష్మీ షోకులు.!
NQ Staff - September 10, 2022 / 10:03 AM IST

Rashmi Gautam : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్‌కి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకుల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకుంది యాంకర్‌గా రష్మీ గౌతమ్. అలాగే కుర్రకారు గుండెల్లో ఆరాధ్య దేవతగానూ మారిపోయింది.

Rashmi Gautam Latest Cute Photos
సుధీర్‌తో రష్మీ గౌతమ్ లవ్ ట్రాక్‌కి పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్ వున్నారనడం అతిశయోక్తి కాదేమో. అందుకే వీరిద్దరి కెమిస్ర్టీని పలు ఛానెళ్లు తదనుగుణంగా వాడేస్తుంటారు వీలు చిక్కినప్పుడల్లా.

Rashmi Gautam Latest Cute Photos
అయితే, వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లాంటివేమీ లేవనీ, జస్ట్ ఫ్రెండ్‌షిప్ అనే షిప్ మాత్రమే వుందనీ చాలా సార్లు ఈ క్యూట్ పెయిర్ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, ఎన్ని చెప్పినా ఈ జంటపై వచ్చే రూమర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా పుట్టుకొస్తూనే వుంటాయ్.

Rashmi Gautam Latest Cute Photos
రారా రక్కమ్మా.. రష్మీ గౌతమ్ స్టైలింగ్ సూపరమ్మా.!

Rashmi Gautam Latest Cute Photos
ఆ మధ్య రష్మీ గౌతమ్ పెళ్లి చేసుకోబోతోందంటూ కొత్త పుకార్లు షికార్ చేశాయ్. కానీ, అలాంటి అప్‌డేట్ ఏమీ రాలేదు ఆ తర్వాత. సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్‌కి నెక్స్‌ట్ లెవల్ క్రేజ్ వుందనీ నెటిజనానికి తెలిసిన ముచ్చటే.

Rashmi Gautam Latest Cute Photos
అందుకే ఆ నెటిజనాన్ని ఖుషీ చేయడానికి అప్పుడప్పుడూ అందాల ఫోటోల్ని రకరకాల పోజుల్లో దించుతూంటుంది రష్మీ గౌతమ్.

Rashmi Gautam Latest Cute Photos
అలా తాజాగా వైలైట్ కలర్ డ్రస్‌లో రష్మీ గౌతమ్ కొన్ని పిక్స్ వదిలింది. వదిలిన కాసేపట్లోనే ఈ పిక్స్ వైరల్ అయిపోయాయ్.

Rashmi Gautam Latest Cute Photos
మరీ ఓవర్ డోస్ గ్లామర్ అని చెప్పలేం కానీ, రారా రక్కమ్మా.. స్టైల్‌లో పర్పుల్ కలర్ డ్రస్‌లో మెరిసిపోతోంది రష్మీ.

Rashmi Gautam Latest Cute Photos
ఎప్పటిలాగే క్యూట్ అప్పీల్‌తో కట్టిపడేస్తోంది. లవ్ సింబల్ ఇయర్ రింగ్స్ రష్మీ అందాన్ని మరింత పెంచేస్తున్నాయ్. ఈ శుక్రవారం జబర్దస్త్ షోలో రష్మీ ఇలా తళుక్కున మెరవబోతోందన్న మాట.

Rashmi Gautam Latest Cute Photos