Rashmi Gautam : అతనితో లవ్ లో పడ్డ యాంకర్ రష్మీ.. స్టేజిపైనే చెప్పేసిందిగా..!
NQ Staff - April 20, 2023 / 11:20 AM IST

Rashmi Gautam : యాంకర్ రష్మీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకరమ్మగా పేరు తెచ్చుకుంది. ఆమె జబర్దస్త్ తో మొదలుపెట్టిన జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఒక ప్రోగ్రామ్ కు ఇన్నేండ్లుగా యాంకర్ గా చేయడం అంటే మాటలు కాదు. కాగా ఇప్పుడు మల్లెమాలలో ఆమెనే టాప్ పొజీషన్ లో ఉంది.
అయితే ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె సదరు వ్యక్తితో ప్రేమలో ఉందంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరోసారి ఇదే టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ఇందులో నటుడు బ్రహ్మాజీ, రష్మీ, బుల్లెట్ భాస్కర్ ఓ స్కిట్ చేశారు. అయితే సదరు స్కిట్ లో భాగంగా రష్మీ తన లవ్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఓ బాక్సులో రాయి వేద్దామని నిర్ణయించుకుంది. అనుకున్నట్టు గానే ఆమె రాయి వేస్తుంది. ఇంతకీ ఆ రాయి బాక్సులో పడిందా లేదా అనేది సస్పెన్స్.
అక్కడితో ప్రోమోను కట్ చేశారు. అయితే రాయి బాక్సులో పడనట్టే రష్మీ ఎక్స్ ప్రెషన్ పెట్టింది. దాంతో ఈ ప్రోమో చూసిన వారంతా నిజంగానే ఆమె ఎవరితోనే లవ్ లో ఉందని అంటున్నారు. లేకపోతే ఆ ఫేస్ లో అంత ఎక్స్ ప్రెషన్ రాదు కదా అంటున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని ఆరాలు తీస్తున్నారు.